fake certificates: చింతలపూడిలో నకిలీ ధ్రువపత్రాల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో నకిలీ ధ్రువపత్రాలను కాలేజీ యాజమాన్యం గుర్తించింది. దూరవిద్యకు సంబంధించి కళాశాలను యాజమాన్యం నడుపుతుంది. వారి కళాశాలకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాన్ని గుర్తించారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన చింతలపూడి పోలీసులు. గతంలో టోల్ ప్లాజాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన అనుభవంతో యూట్యూబ్లో నకిలీ ధ్రువపత్రాలు ఎలా తయారు చేయాలో నిందితులు నేర్చుకున్నారు. మెటీరియల్ చెన్నై నుంచి కొనుగోలు చేసి నకిలీ ధృవపత్రాలను నిందితులు తయారు చేశారు.
10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు 30 నుంచి 50 వేల వరకు విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ధ్రువపత్రాలకు 80,000 నుంచి లక్ష రూపాయల వరకు రేటును నిందితులు నిర్ణయించారు. ఇంజనీరింగ్ ధృపత్రం, ఎంటెక్ ధ్రువపత్రాలకు లక్ష నుంచి 1,50 000 వరకు ధర నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ధ్రవపత్రానికి రూ.1.50 లక్షల వసూలు.. 10వ తరగతి నుంచి పీజీ వరకు ఏ పత్రం కావాలన్నా ఆయా కళాశాలల లోగోలతో తయారు చేసి, ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపి, అనంతరం పోస్టుద్వారా పంపుతారు. అర్హతను బట్టి ఒక్కో ధ్రువపత్రానికి రూ.10వేల నుంచి రూ.1.50లక్షల వరకు వసూలు చేస్తారు. ఇటీవల ఏలూరుకు చెందిన ఓ కళాశాల పేరుతో ధ్రువపత్రం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు కళాశాల యాజమాన్యం నిందితులను పట్టుకునేందుకు తమకు ధ్రువపత్రం కావాలని చింతలపూడికి చెందిన సోంబాబును సంప్రదించారు.
అధిక సంపాదన కోసం ఇద్దరూ నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి విక్రయించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు నిందితులు. దినేష్‌కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ప్రింటర్లు, ల్యాప్‌ట్యాప్, ధ్రువపత్రాలకు ఉపయోగించే పేపర్లు, రబ్బరుస్టాంప్‌లు కొనుగోలు చేసి తయారీ ప్రారంభించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏలూరులో దినేష్ ఇంట్లో తనిఖీలు చేసి ల్యాప్‌ట్యాప్, నకిలీ ధ్రువపత్రాలు, రబ్బరు స్టాంపులు, ప్రింటర్లు, హోలోగ్రామ్స్, పెన్‌డ్రైవ్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. ఈ ముఠా 2 తెలుగు రాష్ట్రాల్లో 50 మందికిపైగా నకిలీ ధ్రువపత్రాలు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తెలిందన్నారు సీఐ. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: దమ్ముంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి..వైసీపీ మంత్రులకు భూమా అఖిలప్రియ సవాల్