Italy: ఇటలీలో బిజీబిజీగా మోదీ..పోప్‌, అగ్రనేతలతో సమావేశం

జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళిన ప్రధాని మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీను కూడా మీట్ అయ్యారు. ఇందులో రష్యాతో జరుగుతున్న యుద్ధంపై కీలక చర్చలు చేసినట్లు తెలుస్తోంది.

Italy: ఇటలీలో బిజీబిజీగా మోదీ..పోప్‌, అగ్రనేతలతో సమావేశం
New Update

G7 Summit: లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ ఇటలీకి మొదటి విదేశీ ప్రయాణం చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన జీ7 సమావేశాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా మోదీ పలువురు ప్రపంచాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌.. అలాగే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, మోదీ మధ్య భేటీ జరిగింది. ఈ విషయాన్ని ప్రధానే స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

publive-image publive-image

యుద్ధంపై కీలక చర్చ..

జెలెన్‌స్కీ తో జరిగిన సమావేశంలో ఆయన మోదీకి రష్యాతో జరుగుతున్న యుద్ధం గురించి వివరించారు. పుతిన్ సేనలతో తాము ఎందుకు పోరాడవలసి వస్తోందో అన్న విషయాన్ని వివరాలతో సహా చెప్పనట్లు తెలుస్తోంది. అలాగే రక్షణ, అంతరిక్ష, విద్య, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చర్చలు జరిపారు. మరోవైపు జీ7 సమావేశంలో కూడా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధమే చర్చకు వచ్చింది. ఫ్రీజ్‌ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపాయి.

సమావేశంలో పోప్ కీలక వ్యాఖ్యలు..

ఇక జీ7 సమ్మిట్కు హాజరయిన పోప్ ఫ్రాన్సిస్ కృత్రిమ మేథ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ మాన సంబంధాలను యాంత్రికంగా మార్చేస్తుందని ఆయన అన్నారు. కృత్రియ మేధను అభివృద్ధి చేసే క్రమంలో మానవాళి గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. అదేశిదంగా మనుషులు కూడా మానవమేథను సరైన విధంగా ఉపయోగించాలని పోప్ అన్నారు. మన జీవితాలను యంత్రాలు కాకుండా మనమే తీర్చిదిద్దుకునేలా ఏఐని కట్టడి చేయడానికి నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక జీ7 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి పోప్‌గా ఫ్రాన్సిస్ రికార్డ్ సృష్టించారు.

Also Read:Andhra Pradesh:ఉదయం 10 నుంచి 6గంటల వరకు సచివాలయంలోనే..చంద్రబాబు నిర్ణయం

#g-summit #italy #jelensky #pm-modi #rishi-sunak
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe