PM Modi 10 Day Tour Across India: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూకుడు పెంచాడు. లోకసభ ఎన్నికల (Lok Sabha Elections 2024) షెడ్యూల్ విడుదల కాకముందే దేశంలో సుడిగాలి పర్యటన చేసేందుకు సిద్ధమయ్యారు. 10 రోజుల్లో 12 రాష్ట్రాలను చుట్టేయనున్నారు. ఇందులో తెలంగాణ (Telangana), తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ & కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీతోపటు కేంద్రపాలిత ప్రాంతాల్లో మోదీ పలు కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మార్చి 4న, తెలంగాణలోని ఆదిలాబాద్లో (Adilabad) బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆదిలాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.
పూర్తిగా చదవండి..PM Modi Tour : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన..10 రోజుల..12 రాష్ట్రాల టూర్.!
లోకసభ ఎన్నికల నగరా మోగడానికి ముందే ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధమైంది. 10రోజుల్లో 12 రాష్ట్రాలను చుట్టేయనున్నారు మోదీ. వచ్చే 10రోజుల్లో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
Translate this News: