Telangana: అడుగు పెట్టకముందే అలజడి రేపిన ప్రధాని మోదీ.. బీఆర్ఎస్‌పై సంచలన కామెంట్స్..

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సాఫీగా సాగుతుందనుకుంటే.. పొరపాటే. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలంగాణ(Telangana) గడ్డపై అడుగు పెట్టక ముందే.. పొలిటికల్ హీట్ అమాంతం పెంచేశారు. ట్విట్టర్ వేదికగా ప్రదాని మోదీ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

DA Hike: ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా శుభవార్త.. 4 శాతం డీఏ పెంపు
New Update

PM Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సాఫీగా సాగుతుందనుకుంటే.. పొరపాటే. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలంగాణ(Telangana) గడ్డపై అడుగు పెట్టక ముందే.. పొలిటికల్ హీట్ అమాంతం పెంచేశారు. ట్విట్టర్ వేదికగా ప్రదాని మోదీ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. అసమర్థ బీఆర్‌ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారంటూ పొలిటికల్ బాంబ్ పేల్చారు. ప్రజలు కాంగ్రెస్‌పైనా అంతే విశ్వాసంతో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ప్రజలకు ఒకటేనని, ప్రజల గురించి ఆ పార్టీలకు అవసరం లేదన్నారు. వంశపారంపర్య పార్టీలకు తమ అభివృద్ధి తప్ప.. ప్రజల అభివృద్ధి పట్టదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌కు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 13,5000 కోట్ల విలువైన పలనుకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ. రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వే ప్రాజెక్టులతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు.. శంకుస్థాపన చేయనున్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తాను ప్రారంభించబోయే ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఇదీ ప్రధాని మోదీ పాలమూరు షెడ్యూల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు అంటే అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి మోడీ చేరుకుంటారు. 1:35కి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌ వెళ్తారు. మధ్యాహ్నం 2:05 గంటలకు పాలమూరుకు ప్రధాని చేరుకుంటారు. 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన సమరభేరి బహిరంసగ సభకు చేరుకుంటారు ప్రధాని మోదీ. సాయంత్రం 4 గంటల వరకు ఆ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం హెలికాప్టర్‌లో సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్‌ కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు.


Also Read:

Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!

#telangana #pm-modi #telangana-elections #brs-party #pm-narendra-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe