PM Modi: నేను లాహోర్‌కి వెళ్తా.. పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ ఫన్నీ కామెంట్స్

తాజాగా ప్రధాని మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని.. భారత్ అప్రమత్తంగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా 'నేను లాహోర్‌కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని ప్రధాని మోదీ ఫన్నీగా కామెంట్ చేశారు.

Elections 2024 : ఎక్కడ ప్రచారం చేశారో అక్కడ ఓటమి.. మహారాష్ట్రలో పని చేయని మోదీ చరిష్మా
New Update

PM Modi: దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో పూర్తయ్యాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున భారత్‌ పాకిస్థాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా.. 'నేను లాహోర్‌కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని' ప్రధాని ఫన్నీగా కామెంట్ ఇచ్చారు. ఈ సమాధానం విన్న అక్కడి ప్రేక్షకులు నవ్వడం మొదలుపెట్టారు.

Also read: నో టెన్షన్.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇకపై ఈజీగా.. 

గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ విషయంలో ఈ వివాదాస్పద ప్రకటన చేశారు. పొరుగు దేశం వద్ద అణుబాంబులు ఉన్నందున భారత్ పాకిస్థాన్‌ను గౌరవించాలని మణిశంకర్ అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుదాడి గురించి ఆలోచించే పరిస్థితి వస్తుందని తెలిపారు. పాకిస్థాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని భారత్ మర్చిపోకూడదని అన్నారు. దీనికి కౌంటర్‌గా ప్రధాని లాహోర్‌కు వెళ్లి చెక్‌ చేస్తానంటూ ఫన్నీగా స్పందించారు.

#modi #pm-modi #nuclear-bomb #pakistan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి