PM Modi: నేను లాహోర్‌కి వెళ్తా.. పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ ఫన్నీ కామెంట్స్ తాజాగా ప్రధాని మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని.. భారత్ అప్రమత్తంగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా 'నేను లాహోర్‌కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని ప్రధాని మోదీ ఫన్నీగా కామెంట్ చేశారు. By B Aravind 23 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi: దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో పూర్తయ్యాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున భారత్ పాకిస్థాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా.. 'నేను లాహోర్‌కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని' ప్రధాని ఫన్నీగా కామెంట్ ఇచ్చారు. ఈ సమాధానం విన్న అక్కడి ప్రేక్షకులు నవ్వడం మొదలుపెట్టారు. Also read: నో టెన్షన్.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇకపై ఈజీగా.. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ విషయంలో ఈ వివాదాస్పద ప్రకటన చేశారు. పొరుగు దేశం వద్ద అణుబాంబులు ఉన్నందున భారత్ పాకిస్థాన్‌ను గౌరవించాలని మణిశంకర్ అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుదాడి గురించి ఆలోచించే పరిస్థితి వస్తుందని తెలిపారు. పాకిస్థాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని భారత్ మర్చిపోకూడదని అన్నారు. దీనికి కౌంటర్‌గా ప్రధాని లాహోర్‌కు వెళ్లి చెక్ చేస్తానంటూ ఫన్నీగా స్పందించారు. पाकिस्तान से डरो, क्योंकि उसके पास परमाणु बम है, देखिए इस पर पीएम मोदी ने क्या जवाब दिया... @narendramodi | @PMOIndia @BJP4India pic.twitter.com/C0KnWkVsqX — Shubham Rai (@shubhamrai80) May 23, 2024 #pm-modi #modi #pakistan #nuclear-bomb మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి