Olympics Winners: ఆగస్టు 15న ఒలింపిక్స్‌ విజేతలతో ప్రధాని భేటీ

పారిస్ ఒలింపిక్స్ అయిపోయాయి. అందరూ స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో భారత్‌కు తిరిగివచ్చిన అథ్లెట్లను భారత ప్రధాని మోదీ ఆగస్టు 15న కలవనున్నారని సమాచారం. పతకాలు సాధించిన వారితో ప్రధాని భేటీ కానున్నారు.

New Update
Olympics Winners: ఆగస్టు 15న ఒలింపిక్స్‌ విజేతలతో ప్రధాని భేటీ

Olympics India Winner : రేపటితో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరూ దేశానికి చేరుకుంటారు. మొన్న ఆదివారం ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం జరిగింది. దీంతో అందరూ ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన క్రీడాకారులు కూడా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది భారత్‌కు తిరిగి రాగా...మరికొంత మంది మాత్రం ఈరోజు వస్తారు. ఈ నేపథ్యంలో భారత్‌కు పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని మోదీ భేటీ అవ్వనున్నారని తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో భారత స్వతంత్ర దినోత్సవం వస్తోంది. అదే రోజు మధ్యాహ్నం అథ్లెట్లను ప్రధాని మోదీ కలుస్తారని చెబుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయని తెలిసిందే. భారత్ నుంచి117 మంది సభ్యులతో కూడిన బృందం పారిస్‌కు వెళ్లింది. అందులో చాలా మంది అథ్లెట్లు తిరిగి వచ్చారు.

ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకల్లో భారత పతాక బేరియర్లుగా మనుబాకర్, హాకీ క్రీడాకారుడు పీఆర్ శ్రీజేష్‌లు పాల్గొన్నారు. వీరితో పాటూ హాకీ క్రీడాకారులందరూ పారిస్‌లోనే ఉన్నారు. ఇక వినేశ్ ఫోగాట్ మరి కొంత మంది అథ్లెట్లు కూడా అక్కడే ఉన్నారు. వీరందరూ ఈ రోజు భారత్‌కు చేరుకోనున్నారు. అయితే ఇండియాకు రజతాన్ని సాధించిన జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మాత్రం నెల తర్వాతనే స్వదేశానికి రానున్నాడు. ఇతను పారిస్ ఉంచి నేరుగా జర్మనీ వెళ్ళనున్నాడు.

Also Read:TRAI: అలాంటి కాల్స్ చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్..ట్రాయ్ కొత్త రూల్స్

Advertisment
తాజా కథనాలు