తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ లో తెలంగాణలో తప్ప మిగతా రాష్ట్రాల్లో బీజేపీ విజయభేరి మోగించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లో అత్యధిక మెజార్టీతో గెలిచింది. దీంతో కాంగ్రెస్ అనుకూలవాదులు, నేతలు బీజేపీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు గట్టిగానే మాధానం చెబుతున్నారు. తాజాగా ప్రధాని మోదీ సైతం తన ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్ళంతే...వాళ్ళు మారరు అంటూ చురకలు అంటించారు.
Also Read:ఢిల్లీలో రేవంత్ రెడ్డి…పెద్దలతో మీటింగ్
అహంకారం, అబద్ధాలు, నిరాశావాదం, ఆజ్ఞానంతో వాళ్ళు(కాంగ్రెస్) ఆనందంగానే ఉన్నారు. కానీ వారి విభజన సిద్ధాంతంతో మాత్రం భారత దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇది వాళ్ళకు 70 ఏళ్ళుగా అలవాటైన పద్ధతి...అంత సులువుగా వదిలిపెట్టలేరు అంటూ సెటైర్లు వేశారు. భారతదేశ ప్రజలు చాలా తెలివిగా ఉంటున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్ కు ఓట్లు వేయకుండా జాగ్రత్తపడుతున్నారని కొనియాడారు. కాంగ్రెస్ ముంద ముందు మరిన్ని పరాహవాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు మోదీ. దీన్నో హెచ్చరిక కింద పోస్ట్ చేశారు మోదీ. చివర్లో లాఫింగ్ ఎమోజీలను కూడా జత చేశారు.
దీంతో పాటూ కాంగ్రెస్ వాళ్ళు చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా తన పోస్ట్ లో జత చేశారు మోదీ. హిందీ హార్ట్‌ల్యాండ్‌లో ఓటర్ల జనాభా రేటు ఎక్కువగా ఉందని, వాళ్ళు పెద్దగా చదువుకోలేదని కాంగ్రెస్ ఆరోపించిందని అన్నాడు. బీజేపీ హిందుత్వాన్ని ప్రచారం చేసిందని, ప్రజలను తప్పుదోవ పట్టించిందని, భారత్‌లో అధిక జనాభాకు మతమే సర్వస్వమని, ఆవు మూత్రంపైనే హిందీ హార్ట్‌ల్యాండ్ ఓట్లేస్తుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత్ కన్నా దక్షిణ భారతానికి ఎక్కువ అవగాహన ఉందని.. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య విభజన బాగా పెరిగిందని వారు అన్నారు.