ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్తో కొత్త విషయాలు పంచుకునే ప్రధాని మోదీ.. నిన్న జరిగిన మన్ కీ బాత్ లో పెళ్లి వేడుకలకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉంటున్న ఉన్నత కుటుంబాలు విదేశాలకు వెళ్లి వివాహ వేడుకలు జరుపుకోవడాన్ని ప్రధానీ మోదీ తప్పుబట్టారు. అయితే ఈ వివాహ వేడుకలు, కొనుగోళ్లను దేశంలోనే జరుపుకోవడం వల్ల ‘వోకల్ ఫర్ లోకల్’కు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ఉన్నత కుటుంబాలకు సూచనలు చేశారు. భారత్లో వివాహాల సీజన్లో సుమారు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందనే అంచనా ఉందని.. పెళ్లి సమయంలో జరిపే కొనుగోళ్లు, వివాహ వేడుకల నిర్వహణలు దేశంలో జరుపుకోవాలని ప్రధాని మోదీ కోరారు.
పూర్తిగా చదవండి..PM Modi: విదేశాల్లో పెళ్లిల్లు ఎందుకు జరుపుకుంటున్నారు.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..
భారత్లో ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు జరుపుకోకూడని ప్రధాని మోదీ ఆదివారం జరిగిన మన్ కీ బాత్లో సూచించారు. భారత్లో వివాహాల సీజన్లో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందనే అంచనా ఉందని.. అందుకే దేశంలో పెళ్లి వేడుకలు జరుపుకోవాలని కోరారు.
Translate this News: