PM Modi: విదేశాల్లో పెళ్లిల్లు ఎందుకు జరుపుకుంటున్నారు.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. భారత్‌లో ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు జరుపుకోకూడని ప్రధాని మోదీ ఆదివారం జరిగిన మన్ కీ బాత్‌లో సూచించారు. భారత్‌లో వివాహాల సీజన్‌లో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందనే అంచనా ఉందని.. అందుకే దేశంలో పెళ్లి వేడుకలు జరుపుకోవాలని కోరారు. By B Aravind 27 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్‌తో కొత్త విషయాలు పంచుకునే ప్రధాని మోదీ.. నిన్న జరిగిన మన్ కీ బాత్ లో పెళ్లి వేడుకలకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉంటున్న ఉన్నత కుటుంబాలు విదేశాలకు వెళ్లి వివాహ వేడుకలు జరుపుకోవడాన్ని ప్రధానీ మోదీ తప్పుబట్టారు. అయితే ఈ వివాహ వేడుకలు, కొనుగోళ్లను దేశంలోనే జరుపుకోవడం వల్ల 'వోకల్ ఫర్ లోకల్'కు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ఉన్నత కుటుంబాలకు సూచనలు చేశారు. భారత్‌లో వివాహాల సీజన్‌లో సుమారు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందనే అంచనా ఉందని.. పెళ్లి సమయంలో జరిపే కొనుగోళ్లు, వివాహ వేడుకల నిర్వహణలు దేశంలో జరుపుకోవాలని ప్రధాని మోదీ కోరారు. Also Read: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి బ్రేక్.. అలాగే షాపింగ్ చేసే సమయంలో కూడా భారత ఉత్పత్తులనే కొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. అసలు విదేశాలకు వెళ్లి పెళ్లి వేడుకలు జరుపుకోవాల్సిన అవసరం ఏముందంటూ అడిగారు. యూపీఐ, డిజిటల్ లావాదేవీలతో నగదు చెల్లింపులు జరపాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సరిగ్గా 15 ఏళ్ల క్రితం భారత్‌లో జరిగిన అత్యంత హేయమైన దాడి అని 2008లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేశారు. అయితే ఆ దాడుల నుంచి కోలుకొని.. ఉగ్రవాదాన్ని ధైర్యంగా అణిచివేయడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. Also Read: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు గురై 20 మంది మృతి.. #telugu-news #pm-modi #wedding #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి