PM Modi : ఢిల్లీలో రైతుల నిరసన.. ప్రధాని మోడీ కీలక ట్వీట్

ఢిల్లీలో రైతులు నిరసన చేస్తున్న క్రమంలో ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల లేవనెత్తిన ప్రతి డిమాండ్‌ను తీర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర పెంచడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు.

New Update
PM Modi : ఢిల్లీలో రైతుల నిరసన.. ప్రధాని మోడీ కీలక ట్వీట్

PM Modi Tweet About Farmers : మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ దేశరాజధాని ఢిల్లీ(Delhi) లో రైతులు చేస్తున్న ఆందోళన బీజేపీ(BJP) కి తలనొప్పిగా మారింది. తాజాగా రైతులు చేస్తున్న నిరసన(Farmers Strike) నేపథ్యంలో ప్రధాని మోడీ(PM Modi) ట్విట్టర్(X) వేదికగా కీలక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమం కోసమే తమ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వారి సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతుల లేవనెత్తిన ప్రతి డిమాండ్ ను తీర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర పెంచడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. గిట్టు బాటు ధర పెంచడం వల్ల కోట్లాది మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 

ఢిల్లీలో రైతు మృతి..

రైతులు చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్‌(Chalo Delhi March) లో భాగంగా బుధవారం పంజాబ్‌- హర్యానా(Punjab-Haryana) సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఖానౌరీ సరిహద్దులో నిరసనకారులను అడ్డుకునే క్రమంలో హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. దీంతో ఒక రైతు తలకు గాయాలై మరణించాడు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ALSO READ: షణ్ముక్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

చర్చలకు కేంద్రం సిద్ధం..

అయితే ఒకవైపు ఘర్షణ వాతావరణం కొనసాగుతుంటే.. మరోవైపు కేంద్రం వారిని చర్చలకు ఆహ్వానించింది. ‘రైతుల డిమాండ్ల(Farmer's Demands) పై మరోసారి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చర్చలకు రైతు సంఘం నాయకులను ఆహ్వానిస్తున్నాం. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం’ అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు