PM Modi Telangana Tour: తెలంగాణలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటూ 8021కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజామాబాద్ లో బీజెపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా పేరు పెట్టారు.

New Update
PM Modi Telangana Tour: తెలంగాణలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన

PM Modi Telangana Tour: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండంతో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే దూకుడు పెంచాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS) ను ఢీకొట్టడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తుండగా... ఇప్పటికే కాంగ్రెస్ కీలకమైన విజయభేరి సభతో పాటు హామీలను ప్రకటించింది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటంతో పాటు... పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. నిజామాబాద్‌ (Nizamabad)లో జరిగే మోడీ సభను ధన్యవాద్‌ సభగా (Modi Public Meeting) జరపనున్నారు. పాలమూరు వేదికగా పసుపు బోర్డు (National Turmeric Board) ఏర్పాటు చేస్తున్నట్లు మోడీ ప్రకటించటంతో ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే గిరిరాజ్‌ కళాశాల మైదానంలో లక్ష మందితో బీజేపీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, నిర్మల్‌, జగిత్యాల జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లను నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Also Read:  తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే!

నిజామాబాద్‌ పర్యటనలో భాగంగా రూ. 8,021కోట్ల విలువైన ప్రాజక్టులను మోడీ ప్రారంబించనున్నారు. ఎన్టీపీసీ(NTPC)లో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మోడీ అంకితం చేస్తారు. 800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్‌ తెలంగాణ వినియోగంలోకి వస్తుంది. నిజామాబాద్‌ పర్యటనలో భాగంగా పవర్‌, హెల్త్‌, రైల్వే ప్రాజక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,369కోట్లతో నిర్మించిన హెల్త్‌ సెంటర్స్‌కు మోడీ భూమిపూజ చేస్తారు. ఇందూరులో హెల్త్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు, రూ.1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్‌ కేర్‌ సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న 50 పడకల ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ బ్లాకులను నిర్మించనునున్నారు.అలాగే రూ.305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయిన లైన్లను మోడీ ప్రారంభించనున్నారు.

ప్రధాని మోదీ సభకు భారీ భద్రతను ఏర్పాటు చేవారు. బీజెపీ ఇందూరు సభకు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఐజీ, డీఐజీతో పాటూ 5గురు ఎస్పీలు, ఇద్దరు బెటాలియన్ కమాండెంట్లు, 13 మంది అదనపు ఎస్పీలు, 13 మంది ఏసీపీలు, 107 మంది సీఐలు, 200 మంది ఎస్ఐలు, 1900 మంది ఏఎస్ఐలు, కానిస్టేబుళ్ళు డ్యూటీ చేయనున్నారు. బ్లూ బుక్‌ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అగ్నిమాపక, ఆరోగ్య, విద్యుత్‌, రోడ్లు భవనాలు తదితర శాఖలు కూడా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు