PM Modi : వయనాడ్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే ?

ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 10న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితుల్ని పరామర్శించనున్నారు.

New Update
Modi : నేడు వయనాడ్‌ కి ప్రధాని మోదీ..!

PM Modi Wayanad Tour : కేరళ (Kerala) లో వయనాడ్‌ జిల్లా (Wayanad District) లో కొండచరియలు (Landslides) విరిగిపడి పెను విషాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘోప విపత్తుతో చనిపోయివారి సంఖ్య 413కి చేరింది. మరో 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది. వాళ్ల కోసం సహాయక బృందాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విపక్ష నేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ (PM Modi) కూడా వయనాడ్‌కు వెళ్లనున్నారు. ఆగస్టు 10న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితుల్ని పరామర్శించనున్నారు.

Also Read: లోక్‌సభలో వక్ఫ్ బోర్డు నియంత్రణకు సవరణ బిల్లు.. అందులో ఏముంది? 

మరోవైపు వయనాడ్ విషాదాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే వారికి పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని లోక్‌సభలో కేంద్రానిపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా జులై 30న భారీ వర్షాల వల్ల వయనాడ్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో ఊర్లకు ఊళ్లే వరదలకు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 417 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. 10 వేల మందికి పైగా బాధితులు ఉపశమన కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

Also Read: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్

Advertisment
Advertisment
తాజా కథనాలు