Telangana Elections: హీటెక్కుతున్న రాజకీయాలు.. తెలంగాణకు రానున్న ప్రధాని

తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ నెల 7,11 తేదీల్లో బీజేపీ నిర్వహించే పలు సభల్లో పాల్గొననున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర బీజేపీ నేతల కోసం మూడు హెలికాప్టర్లు కేటాయించింది.

PM Modi : విశ్వగురు మోదీ.. పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులు..
New Update

ఈ నెల చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. నవంబర్ 7,11 తేదీల్లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. అయితే ఈ తేదీల్లో హైదరాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో సభలు నిర్వహించేందురు రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. అయితే ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటన చేసిన తర్వాత ప్రధాని రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారు.

మరోవైపు నామినేషన్లు ముగిసిన తర్వాత ఈ నెల 15 నుంచి బీజేపీ తమ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయనుంది. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో సహా పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ఈ ప్రచారాల్లో పాల్గొననున్నారు. అయితే నవంబర్ 19 తర్వాత మరోసారి ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

ఇదిలాఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీకి మూడు హెలికాప్టర్లను ఇవ్వనుంది. అందులో ఒకటి పూర్తిగా బండి సంజయ్‌కు కేటాయించారు. అలాగే మరో రెండు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేంధర్‌లతో సహా ముఖ్యనేతలకు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తతం జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న బండి సంజయ్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు ఆయనకు ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.

Also Read: తెలంగాణలో జనసేన పోటీ చేసే 8 సీట్లు ఇవే?

#telugu-news #pm-modi #bjp #telangana-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe