PM Modi : జూన్ 21న యోగా డే.. ప్రధాని మోదీ ఈసారి వెళ్లేది అక్కడికే

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ.. జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏకంగా 7 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
PM Modi : జూన్ 21న యోగా డే.. ప్రధాని మోదీ ఈసారి వెళ్లేది అక్కడికే

Yoga Day : జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం జమ్మూకశ్మీర్‌ (Jammu & Kashmir) లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొననున్నారు. దాల్‌ సరస్సు ఒడ్డున ఆయన యోగా చేయనున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో ఏకంగా 7 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యవేక్షించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈసారి ప్రధాని మోదీ.. కశ్మీర్‌కు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Also read: కల్తీమద్యం కలకలం.. ఐదుగురు మృతి

జమ్మూకశ్మీర్‌ ప్రజలో ప్రధాని మోదీకి మంచి అనుబంధం ఉందని.. అందుకోసమే ఆయన ఈసారి ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఆయన రాక మనకెంతో గర్వకారణమని.. యోగా డే రోజున ఇక్కడ జరగబోయే కార్యక్రమంలో 7వేల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని మనోజ్‌ సిన్హా స్పష్టం చేశారు.

Also read: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. అక్కడ పనిచేస్తే రూ.8 లక్షల ప్యాకేజ్‌

Advertisment
తాజా కథనాలు