PM Modi: 'రాముడిని క్షమించమని వేడుకుంటున్నా'.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ తిరిగొచ్చాడని ప్రధాని మోదీ అన్నారు. రామభక్తులందరూ ఈరోజు ఆనంద పరవశంలో ఉన్నారని.. ఈ క్షణం కోసమే ప్రజలు వందళ ఏళ్లుగా ఎదురుచూశారని తెలిపారు. దేశం మొత్తం ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటోందని పేర్కొన్నారు.

New Update
Lok Sabha Elections 2024 : ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’..ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు 24 భాషల్లో ప్రచార గీతం..!!

Ayodhya Ram Mandir: యూపీలోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తులు పరవశించిపోయారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ' ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ తిరిగొచ్చాడు. ఈ శుభ గడియల్లో ప్రజలందరికి కృతజ్ఞతలు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ (Prana Pratishtha) కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం.

రాముడిని క్షమించమని వేడుకుంటున్నా

మన బాల రాముడు ఇకనుంచి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఇకనుంచి రామ్‌ లల్లా (Ram Lalla) మందిరంలో ఉంటాడు. రామభక్తులందరూ ఈరోజు ఆనంద పరవశంలో ఉన్నారు. 2024 జనవరి 22 అనేది సాధారణ తేదీ కాదు. కొత్త కాల చక్రానిక ప్రతీక. పవిత్రమైన అయోధ్యాపురికి (Ayodhya) శిరసు వంచి నమస్కరిస్తానను. ఈ కార్యాన్ని ఆలస్యం చేసినందుకు క్షమించాలని రాముడిని వేడుకుంటున్నాను. ఈ క్షణం కోసమే ప్రజలు వందళ ఏళ్లుగా ఎదురుచూశారు.

Also Read: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ..

వందల ఏళ్లుగా నిరీక్షణ

బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారు. ఈ క్షణం కోసమే ప్రజలు వందళ ఏళ్లుగా ఎదురుచూశారు. దేశం మొత్తం ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటోంది. ఈరోజు రాత్రికి ప్రతి ఇంట్లో దీపాలు వెలగాలి. ఈ శుభ గడియాల కోసం 11 రోజులు దీక్ష చేశాను. ఏపీలోని లేపాక్షిలో ప్రత్యేక పూజలు నిర్వహించాను. సాగర్ నుంచి సరయూ వరకు రామనామాన్ని జపించా. రామనామం.. దేశ ప్రజల్లో నిండిపోయంది.

న్యాయబద్ధంగానే రామాలయ నిర్మాణం

త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కలియుగంలో కూడా రాముడు వందల ఏళ్ల పాటు వనవాసం చేశాడు. ఈరోజు నేను భారత న్యాయవ్యవస్థకు నమస్కరిస్తున్నాను. శ్రీరాముడి మందిర నిర్మాణం న్యాయబద్ధంగానే జరిగింది. దేశంలో ఈరోజు అన్ని దేవాలయాల్లో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ అనుభూతిని ప్రతి రామ భక్తుడు అనుభవిస్తున్నాడు. మన దేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే ప్రధానం. ఈ క్షణం కేవలం మన విజయం మాత్రమే కాదు. మన వినయానికి కూడా సూచిక.

రాముడు వివాదం కాదు సమాధానం

కొంతమంది వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. పవిత్రత, సామరస్యం, శాంతి అనేవి మన దేశ ఆత్మకు ప్రతిరూపం. మన జీవన విధానం అనేది ఓ వసుధైక కుటుంబం. అత్యున్నతమైన ఆదర్శమూర్తికి ఈరోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. రాముడు అంటే అగ్ని కాదు వెలుగు. రాముడు అంటే ఓ వివాదం కాదు సమాధానం. ఇది కేవలం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కాదు. భారత విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ. రామాలయం కేవలం ఒక ఆలయం కాదు. భారత చైతన్యానికి ఆలయం అంటూ ప్రధాని మోదీ మాట్లాడారు.

Advertisment
తాజా కథనాలు