PM Modi: మరో 25 ఏళ్లు బీజేపీనే.. మోదీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ లైవ్

బీజేపీ.. దర్యాప్తు సంస్థలను వాడుకొని విపక్ష నేతలపై దాడులు చేయిస్తోందన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అంశంపై స్పందించారు. ' ఈడీ సరైన పని చేస్తోంది. ఈడీ నమోదు చేసిన కేసుల్లో 97 శాతం రాజకీయాల్లో లేనివారే ఉన్నారని' అన్నారు.

New Update
PM Modi: మరో 25 ఏళ్లు బీజేపీనే.. మోదీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ లైవ్

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆదివారం బీజేపీ.. తమ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తాజాగా ప్రధాని మోదీ ఓ వార్తసంస్థకు ఇంటర్వూ ఇచ్చారు. బీజేపీ.. దర్యాప్తు సంస్థలను వాడుకొని విపక్ష నేతలపై దాడులు చేయిస్తోందన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రధాని మోదీ దీనిపై కూడా స్పందించారు. ' ఈడీ సరైన పని చేస్తోంది. ఈడీ నమోదు చేసిన కేసుల్లో 97 శాతం రాజకీయాల్లో లేనివారే ఉన్నారని' అన్నారు. దేశ అభివృద్ధి ఎలా జరగాలన్న దానిపై మరో 25 ఏళ్ల నాటికి ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ అనేది కేవలం మోదీ విజన్‌ మాత్రమే కాదని.. ఇది దేశ ప్రజల ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ ఖండించారు. ఎన్నికల సమయంలో నల్లధనాన్ని లేకుండా చేసేందుకు మా ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని.. కానీ విపక్షాలు ఈ స్కీమ్‌పై తప్పుడు ఆరోపణలు చేశాయని విమర్శించారు.

Also read: అక్కడ గుడి ఉండదు.. కానీ మోదీ పూజలు చేస్తారు: రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

2047 విజన్‌ కోసం పనిచేస్తున్నాను

' నాకు పెద్ద ప్రణాళికలకు ఉన్నాయని చెప్పినప్పడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరినీ భయపెట్టేలా నేను నిర్ణయాలు తీసుకోను. దేశం అభివృద్ధి కోసమే నేను నిర్ణయాలు తీసుకుంటాను. గత రెండేళ్లుగా నేను 2047 విజన్‌ కోసం పనిచేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి అభిప్రాయాలు , సలహాలు స్వీకరించాను. రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారని.. దాదాపు 15 లక్షలకు పైగా ప్రజల నుంచి సలహాలు స్వీకరించాను. 2047లో మనం 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపుకుంటాం. ఇది ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతిఒక్కరికి ఒక లక్ష్యమంటూ ఉండాలి. నేను నా గ్రామానికి అధ్యక్షుడిని. 2047 నాటికి నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను.

మా పాలనలో లోటుపాట్లు లేవు

2024 ఎన్నికలను చూసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం, బీజేపీ ప్రభుత్వ విధానం అనేవి ఓటర్ల ముందు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్లు 50-60 ఏళ్ల పాటు పాలించారు. నేను 10 ఏళ్లు పాలించాను. వీటిని ఏ రంగంలోనైనా పోల్చండి. మా ప్రయత్నాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండవు. గత పదేళ్లలో రెండేళ్లు కరోనా వల్ల నష్టపోయాం.ఆ తర్వాత చాలా పరిణామాలు వచ్చాయి. అప్పుడైనా, ఇప్పుడైనా దేశ పురోగతి వేగం, అభివృద్ధి విషయంలో మేము సరైన మార్గంలో వెళ్తున్నామనేది చూడొచ్చు. 2047 వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు మేము దేశ అభివృద్ధిని మరింత పుంజుకునేలా చేసేందుకు నిబద్ధతో ఉన్నాం. మేము మళ్లీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వేగాన్ని పెంచాలి. ఇదే నా లక్ష్య్ం. ప్రజలు పాలించమని బాధ్యతలు అప్పగించినప్పుడు.. మేము దేశ ప్రజల పైనే దృష్టి పెట్టాలి.

Also Read: ఈ ఏడాది సాధారణం కన్నా అధిక వర్షాలు : ఐఎండీ

తొలి వందరోజుల్లోనే ఆ పనులు చేశాం

కానీ దురదృష్టవశాత్తు గత రాజకీయ సంస్కృతి అనేది కుటుంబాన్ని ఎలా బలోపేతం చేయాలి. కుటుంబ మూలాలను ఎవరూ తీసుకెళ్లకుండా ఎలా చేయాలి అనట్లుగా ఉంది. కానీ నేను దేశం బలోపేతం కావాలని పనిచేస్తున్నాను. దేశం బలంగా ఉన్నప్పుడే.. అందరికీ ప్రయోజనాలు అందుతాయి. 2019లో నేను అధికారంలోకి వచ్చాక.. తొలి వంద రోజుల్లోనే ఆర్టికల్ 370 రద్దు చేశాను. ట్రిపుల్ తలాక్ లేకుండా చేసి నా అక్కాచెల్లిలకు స్వేచ్ఛనిచ్చాను. ముందుగానే నేను దీనిపై ప్రణాళిక చేసి.. ఆ తర్వాత ఆచరణలో పెట్టాను. నమ్మకానికి చాలా శక్తి ఉంటుంది. భారత్‌ లాంటి దేశంలో ఈ నమ్మకాన్ని నా బాధ్యతగా పరిగణిస్తాను' అని ప్రధాని మోదీ వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు