/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Modi-6-jpg.webp)
అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 10వేల మందికి పైగా భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ప్రధానీ రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి కీలక సందేశం చేశారు. ఆ వేడుక జరిగే రోజున ప్రజలందరు తమ ఇళ్లల్లో జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. రామజ్యోతితో తమ జీవితాల్లో స్పూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం షోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Also Read: 22న సెలవు ఇవ్వండి.. రేవంత్ సర్కార్ కు బండి సంజయ్ రిక్వెస్ట్!
దేశంలో ఎన్నో ఏళ్ల నుంచే గరీబీ హఠావో నినాదాలు వినిపించినా పేదరికం మాత్రం పోలేదన్నారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠతో దశాబ్దాల పాటు అనుభవించిన ఆవేదన దూరమైపోయిందని తెలిపారు. గతంలో భక్తులు టెంట్ నుంచి బాలరాముడి దర్శనాన్ని చేసుకునేవారని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో భక్తుల చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు. ఇక జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రధాని అనుష్టాన దీక్ష చేస్తున్నారు.
Here is a #ShriRamBhajan from Guyana! I compliment the Guyana Hindu Dharmic Sabha for this effort and also for their other efforts to popularise Hindu culture and ethos. https://t.co/BIEZA7XPhb
— Narendra Modi (@narendramodi) January 19, 2024
ఈ దీక్షలో భాగంగా ఆయన నేలపైనే నిద్రిస్తున్నారు, కొబ్బరి నీళ్లే సేవిస్తున్నారు. నిత్యం రాముడి కీర్తనలు వింటూ..దీక్షకు సంబంధించిన నియమాలను అనుసరిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ క్రమంలోనే రాముడికి అంకితం చేసిన 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను కూడా ప్రధాని తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. రామాయణ సందేశం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి సూర్తినిచ్చిందని పేర్కొన్నారు.
Also read: అయోధ్యలో భారీ భద్రత.. ముగ్గురు అనుమానితులు అరెస్టు..