PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో.. ముస్లిం లీగ్‌ భావజాలాన్ని పోలి ఉంది: మోదీ

కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉన్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. యూపీలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. నేటి భారత్‌కు కావాల్సిన ఆశలు, ఆశయాలకు దూరంగా విపక్ష పార్టీ ఉందని విమర్శించారు.

New Update
PM Modi : శరీర రంగుతో అవమానిస్తే ఊరుకునేది లేదు..శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని

Congress Manifesto Reflects Muslim League - PM Modi: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై స్పందించారు. నేటి భారత్‌కు కావాల్సిన ఆశలు, ఆశయాలకు దూరంగా విపక్ష పార్టీ ఉందని.. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉన్నట్లు ప్రధాని (Modi)  ఆరోపణలు చేశారు. ఇందులో స్వాతంత్రోద్యమం నాటి ముస్లిం లీగ్ ఆనవాళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కొంత లెఫ్టిస్ట్‌ భావజాలం కూడా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.

Also read: ఇళ్లల్లోకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి.. వీడియో వైరల్

అయితే ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) షహరాన్‌పుర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడ నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ కథ.. కొన్ని దశాబ్ధాల క్రితమే ముగిసినట్లు ప్రజలు అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆశలు, ఆశయాలు లేని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోతో దేశాన్ని ముందుకు నడిపించలేదని అన్నారు. అలాగే జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వద్ద.. సరైన ప్రణాళికలు కూడా లేవని.. దార్శనికత లేదని విమర్శించారు. ఇదిలాఉండగా.. దేశంలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 4 న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Also read: వెస్ట్ బెంగాల్ లో NIA బృందం పై రాళ్ల దాడి చేసిన ప్రజలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు