లోక్‌సభలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎంపికైన సందర్భంగా ఆయనను కూర్చీలో కూర్చోబెట్టే సందర్భంగా వీళ్లద్దరూ ఒకచోటుకి వచ్చారు. మొదటగా స్పీకర్‌కు ప్రధాని మోదీ షేక్ బ్యాండ్ ఇవ్వగా.. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అనంతరం మోదీకి కూడా ఇచ్చారు.
Also Read: కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేయడం వెనుక కారణాలేమిటి?
సరిగ్గా ఐదేళ్ల క్రితం లోక్‌సభలో రాహుల్ గాంధీ.. మోదీకి హగ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ వీడియోకి కోట్లాది వ్యూస్ ఉన్నాయి. ఇక తొమ్మిదేళ్ల క్రితం కూడా ఎన్సీపీ అధినేత షరద్ పవార్ పుట్టినరోజు వేడుకల్లో మోదీ, రాహుల్ ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో.. మోదీ, రాహుల్ గాంధీ కేవలం మూడుసార్లు మాత్రమే ఒకచోట కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.