PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసలు.. వేదికపై ఏం చేశారంటే

సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రత్యేక స్మారక స్టాంప్‌ను, నాణేన్ని ఆవిష్కరిస్తుండగా దాని రిబ్బన్‌ను తన జేబులో పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్‌ పట్ల ఆయనకున్న నిబద్ధతను నెటీజన్లు కొనియాడుతున్నారు.

PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసలు.. వేదికపై ఏం చేశారంటే
New Update

మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా 2014లో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, అలాగే గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. మన ఇంటిని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మిషన్‌కు ప్రజల నుంచి విశేష ఆధరణ దక్కింది. ఇప్పటికీ ఈ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలు అమలవుతునే ఉన్నాయి. అయితే తాజాగా ప్రధాని మోదీ ఓ ఈవెంట్‌లో చేసిన పనికి సోషల్ మీడియాలో ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి

ఇక వివరాల్లోకి వెళ్తే.. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ డిస్ట్రిక్ట్ జ్యూడీషియరీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రత్యేక స్మారక స్టాంప్‌ను, నాణేన్ని ఆవిష్కరించారు. ఈ సమయంలో దానికి సంబంధించిన రిబ్బన్‌ను విప్పిన తర్వాత దాన్ని కింద పడయలేదు, అలాగే అక్కడున్న వారికి ఇవ్వలేదు. ఆ రిబ్బన్‌ను ప్రధాని మోదీ తన జేబులోనే పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే కదా స్వచ్ఛ భారత్‌కు నిదర్శనం అని ప్రధాని మోదీని పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడుతున్నారు.

Also Read:  అలెర్ట్‌.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు

#telugu-news #pm-modi #swachh-bharat-program
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe