Pm Modi About China: భారత్‌తో , చైనాకు సంబంధాలు చాలా ముఖ్యమైనవే కాక ఎంతో కీలకమైనవి కూడా అంటున్నారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య శాంతి, స్నేహం భారత్, చైనాలకే కాక ప్రపంచం మొత్తానికి కూడా చాలా అవసరం అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి చర్చించారు. ఇరుదేశాలు ద్వైపాక్షిక పరస్పర చర్చల ద్వారా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనటం భారత్, చైనా రెండు దేశాలకు చాలా అవసరం. రెండు దేశాలు ఆర్ధికంగా ఇప్పుడు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఎంతో లాభదాయకమని చెప్పారు ప్రధాని.
సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు మేం రెడీ..
సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించడానికి భారత్ సిద్ధంగా ఉందని...దాని కోసం చర్చలకు కూడా తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య సానుకూల దౌత్య, మిలిటరీ స్థాయి ద్వైపాక్షిక చర్చల జరుగుతాయని ఆశిస్తున్నా. చైనా కూడా దీనికి సానుకూలంగా స్పందించాలని ఆయన కోరుతున్నా అన్నారు. 2020 నుంచి తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ దగ్గర భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం జరుగుతూనే ఉంది. దాంతో పాటూ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా రెండు దేశాలు కొట్టుకుంటూనే ఉన్నాయి. వీటి గురించి ఇరు దేశాల మధ్య చాలాసార్లు దౌత్య, ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. కానీ చైనా మాత్రం సరిహద్దుల్లో గొడవలు రేపుతూనే ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో పేర్లను మారుస్తామని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఋ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.