మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య తగ్గిన రేటింగ్ గ్యాప్..మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే

మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడచిన సందర్భంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిర్వహించింది. మోదీ ప్రభుత్వమే ఇంకా టాప్ లో ఉందని సర్వేలో తేలింది. మరోవైపు కాంగ్రెస్ 100 సీట్ల అడ్డంకిని దాటుకుని దూసుకుపోతోందని చెప్పింది.

New Update
Rahul Gandhi: నీట్ పై చర్చ జరగాలి.. ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

Mood Of The Nation Survey: భారత్‌లో ఎన్డీయే కూటమి మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గ మెజారిటీ రాకపోయినా కూటమి పార్టీలు అయిన టీడీపీ, జేడీయూ మద్దతుతో మాజిక్ ఫిగర్‌‌ను సంపాదించుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి ఇప్పటికి మూడు నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో ఇండయా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేసింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయలను తెలుసుకుంది. ఈసర్వేలో ప్రజల ఆలోచనల్లో పెద్దగా మార్పు రాలేదని తెలుస్తోంది.

ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయే కూటమే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వేలో తేలింది. ఈసారి ఎన్డీయే కూటమి ఆరు స్థానాలను మెరుగుపర్చుకుని 299 సీట్లు సంపాదిస్తుందని సర్వే చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ కూడా దూసుకుపోతోందని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్పింది. కాంగ్రెస్ వంద సీట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని తెలిపింది.

రాహుల్ గాంధీకి పెరుగుతున్న క్రేజ్..

మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేల అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేటంటే...ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి మధ్య ఉన్న రేటింగ్ గ్యాప్ తగ్గింది. ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రధాని మోదీకి 49శాతం మంది ఓటేస్తే...రాహుల్ గాంధీకి 22.4 శాతం మంది ఓటేశారు. ఇంతకు ముందు సర్వేతో పోలిస్తే మోదీకి ఆరు పాయింట్లు తగ్గగా..రాహుల్ గాంధీకి ఎనిమిది పాయింట్లు పెరిగాయి.

Also Read: Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Advertisment
తాజా కథనాలు