మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య తగ్గిన రేటింగ్ గ్యాప్..మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే
మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడచిన సందర్భంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిర్వహించింది. మోదీ ప్రభుత్వమే ఇంకా టాప్ లో ఉందని సర్వేలో తేలింది. మరోవైపు కాంగ్రెస్ 100 సీట్ల అడ్డంకిని దాటుకుని దూసుకుపోతోందని చెప్పింది.