Modi: నాకు ఓ ఇల్లుంటే బాగుండేది.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ తన బాల్యాన్ని తలచుకుంటూ భాగోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు షోలాపూర్‌లో పీఎమ్ ఆవాస్‌ యోజన-అర్బన్‌ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. చిన్నతనంలో తనకూ ఇలాంటి ఇంట్లో నివసించాలనే కోరిక ఉండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Modi: నాకు ఓ ఇల్లుంటే బాగుండేది.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని
New Update

PM Modi Crying: భారత ప్రధాని నరేంద్ర మోడీ  తన బాల్యాన్ని తలచుకుంటూ భాగోద్వేగానికి లోనయ్యారు. చిన్న తనంలో తనకు ఒక మంచి ఇంట్లో జీవించాలని కోరిక ఉండేదని, అయితే ఇప్పుడు తన చేతులమీదుగా పేద ప్రజలకు ఇళ్లు ఇస్తుంటే సంతోషంగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇళ్ల పంపిణీ..
ఈ మేరకు శుక్రవారం మహారాష్ట్ర (Maharashtra)లో పర్యటించిన ఆయన.. షోలాపూర్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ పథకం (Pradhan Mantri Awas Yojana) కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘పీఎం ఆవాస్‌ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీని ఈ రోజు ప్రారంభించాం. నేను 2014లో ఈ కల నేరవేరుస్తానని హామీ ఇచ్చాను. ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇళ్లను చూడగానే బాల్యం గుర్తొచ్చింది. చిన్నతనంలో నాకు ఇలాంటి ఇంట్లో నివసించాలనే కోరిక ఉండేది. నిజంగా ఇవన్నీ పరిపూర్ణ క్షణాలు’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Mary:మళ్లీ మోడీ కావాలని అమెరికన్లు కోరుతున్నారు.. సింగర్ మేరీ కీలక వ్యాఖ్యలు

ప్రజల కలలే మా ప్రభుత్వ హామీలు..
అలాగే ప్రజల కలలే తమ ప్రభుత్వ హామీలని మోడీ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ చేరువకాకపోవడంతో ‘గరీబీ హఠావో’ కేవలం నినాదంగా మిగిలిపోయిందని ప్రతిపక్షాలను విమర్శించారు. తమ పాలనలో చిట్టచివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక అయోధ్యలో శ్రీరాముని ప్రాణ పతిష్ట గురించి మాట్లాడిన ప్రధాని.. ఆ మహోన్నత ఘట్టాన్ని పురస్కరించుకుని జనవరి 22న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో రామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. ‘శ్రీరాముడి నిజాయితీని మా గవర్నమెంట్ ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తుంది. మన విలువలు, కట్టుబాట్లను గౌరవించాలని ఆ భగవంతుడు బోధించాడు. అదే బాటలో నడుస్తూ పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం మేము కష్టపడి పనిచేస్తున్నాం’ అని ఆయన చెప్పుకొచ్చారు.

#pm-modi #narendra-modi #maharastra #distribution-of-houses
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe