PM Narendra Modi : ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) కొనసాగతున్నాయి. ఈరోజు 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో విడత ఎన్నికల జరగుతున్నాయి. ప్రధాని మోదీ(PM Modi) తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గుజరాత్(Gujarat) లోని గాంధీనగర్‌కు వెళ్లారు. ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అహ్మదాబాద్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత మోదీ మాట్లాడారు. దేశప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకొని కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందని పేర్కొన్నారు.
Also Read: స్కిల్స్ పెంచుకోవడంలో మహిళలే టాప్.. ఈ లెక్కలు చూడండి..
అయితే తాజాగా ప్రధాని మోదీకి సంబంధించిన ఓ యానిమేటెడ్ వీడియో సోషల్ మీడియా(Social Media) లో చక్కర్లు కొడుతుంది. ఓ మ్యూజిక్ ఈవెంట్‌లో ఆయన డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిని కృష్ణ అనే నెటీజన్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. 'ఇలా చేసినందుకు ఆ నియంత నన్ను అరెస్టు చేయడని తెలుసు కాబట్టే ఈ వీడియో పోస్ట్ చేశానంటూ' రాసుకొచ్చాడు. అయితే ఈ యానిమేటేడ్ వీడియోపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ' మీ అందరిలాగే నేను కూడా నా డ్యాన్స్‌ను చూసి ఎంజాయ్ చేశాను. ఎన్నికలు ఉన్న వేళ.. ఇలాంటి క్రియేటివిటీ అనేది నిజంగా ఆనందం కలగించే విషయం' అంటూ పేర్కొన్నారు. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
Also Read: నిలిచిపోయిన సునితా విలియమ్స్ రోదసి యాత్ర.