PM Modi: ప్రధాని మోదీ రికార్డ్‌.. ఎక్స్‌లో 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు

ప్రధాని మోదీ ఎక్స్‌ ఖాతాలో ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 100 మిలియన్లు దాటింది. దీనిపై ప్రధాని స్పందించారు. ఎక్స్‌లో ఉండటం, సోషల్ మీడియా వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు తదితర వాటికి ఆదరణ వస్తుండటం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.

New Update
PM Modi: ప్రధాని మోదీ రికార్డ్‌.. ఎక్స్‌లో 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు

సోషల్ మీడియాలో ప్రధాని మోదీ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యక్రమలు, విదేశీ పర్యటనలు ఇలా అన్నింటికీ సంబంధించిన విషయాలను నిత్యం ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని తన ఎక్స్‌(ట్విట్టర్‌) ఖాతాలో రికార్డు సృష్టించారు. ఎక్స్‌లో ఆయనను అనుసరించే వారి సంఖ్య 100 మిలియన్లు (10 కోట్లు) దాటింది. దీనిపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. ఎక్స్‌లో ఉండటం, సోషల్ మీడియా వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు తదితర వాటికి ఆదరణ వస్తుండటం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.

Also read: ఆహ్వానం లేకుండానే అంబానీ పెళ్లికి వెళ్లారు.. చివరికి

2009లో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్‌ వాడటం ప్రారంభించారు. తక్కువ కాలంలోనే 2010లో ఆయనకు లక్ష మంది ఫాలోవర్లను పొందారు. ఇలా క్రమంగా పెరుగుతూ 100 మిలియన్లు దాటింది. ప్రస్తుతం ప్రపంచ నేతల్లో ఎవరికీ కూడా ఈ స్థాయిలో ఆదరణ లేదు.

Also read: తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం

Advertisment
తాజా కథనాలు