PM Modi: భూటాన్‌లో ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం..

భూటాన్‌ దేశం ప్రధాని మోదీకి ఆర్డర్‌ ఆఫ్ ది డ్రూక్‌ గ్యాల్పో అనే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, కరోనా సమయంలో భూటాన్‌కు 5 లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలకు గుర్తుగా ఆయనకు దీన్ని అందజేశారు.

New Update
PM Modi: భూటాన్‌లో ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశం ఆయనకు ఆర్డర్‌ ఆఫ్ ది డ్రూక్‌ గ్యాల్పో అనే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్‌ ప్రధానికి దీన్ని ప్రదానం చేశారు. దీంతో భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నేతగా మోదీ నిలిచారు. వాస్తవానికి ఈ అవార్డును 2021లోనే ఆయనకు ప్రకటించారు. భారత్‌-భూటాన్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో సహా.. కరోనా సమయంలో భూటాన్‌కు 5 లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలకు జ్ఞాపకార్థకంగా ఈ గుర్తింపును ఇచ్చారు.

Also Read: సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల కస్టడీ

ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధాని మోదీ.. ఈ అవార్డు స్వీకరించడం గౌరవంగా ఉందని.. దీన్ని 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు భూటాన్‌లో ఆయన ఆ దేశ దాషో షెరింగ్‌ తోబ్గేతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పునరుత్పాతక ఇంధనం, పర్యావరణం, పర్యటకం, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఇదిలాఉండగా.. రెండు రోజుల పాటు అధికార పర్యటన కోసం ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం భూటాన్‌కు చేరుకున్నారు. నిన్ననే (గురువారం) వెళ్లాల్సినప్పటికే పలు కారణాల వల్ల ఒకరోజు ఆలస్యం జరిగింది. అయితే 2014లో మోదీ.. భారత ప్రధానిగా మొదటిసారిగా అధికారం చేపట్టినప్పటి నుంచి భూటాన్‌లో పర్యటించడం ఇది మూడోసారి. తాజాగా పర్యటన నేపథ్యంలో భూటాన్‌లోని థింపూలో భారత నిధులతో నిర్మించిన ఆస్పత్రిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

Also Read: భర్త అరెస్టుపై స్పందించిన సునీతా కేజ్రీవాల్.. మోదీపై ధ్వజం

Advertisment
Advertisment
తాజా కథనాలు