PM Modi On J&K Terror Attack: ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి తెలిసిందే. భక్తులతో వెళ్తున్న ఓ బస్సుపై కాల్పులు జరపడంతో అది అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వీటిని ఎదుర్కొనేందుకు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో వెంటనే భద్రతా బలగాలను మోహరింపజేయాలని జాతీయ భద్రతా సలహాదారు, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు.
Also Read: ఉద్యోగులు, పెన్షనర్లకు 4% రాయితీ పెంచిన సిక్కిం ప్రభుత్వం!
ఇదిలాఉండగా.. ఆదివారం శివ్‌ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణవి దేవి గుడికి బయల్దేరిన బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ విషాద ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందారు. ఈ వాహనంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత దోడా, కథువా జిల్లాల్లో కూడా వరుసగా ఉగ్ర ఘటనలు చోటుచేసుకొన్నాయి.
Also Read: పూరీ జగన్నాథ దేవాలయం తలుపులన్నీ తెరవనున్న ఒడిశా ప్రభుత్వం!