Uttarakhand: ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా- ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్ లోయలో పడి చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వారికి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఆర్ధిక సాయాన్ని ఇస్తామని చెప్పారు.

New Update
Uttarakhand: ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా- ప్రధాని మోదీ

PM Modi Announces Ex-gratia For Uttarakhand Victims: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో సుమారు 17 మంది ప్రయాణికులతో ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. ఈ లోయ దాదాపు 150-200 మీట్లర్లు ఉండడంతో ప్రమాదం పెద్దగానే జరిగింది. దాంతో పాటూ అక్కడే ఉన్న అలనంద నదిలోకి కూడా వాహనం దొర్లిపోయింది. ఈ కారణంగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని బృందం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి పంపింది.

ఇక ప్రమాదం మీద ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ప్రధాని మంత్రి మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ (PM Relief Fund) నుంచి మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

Also Read: Andhra Pradesh: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ – సీఎం చంద్రబాబు నాయుడు

Advertisment
తాజా కథనాలు