Ecuador : ప్లీజ్ నన్ను కాల్చొద్దు... లైవ్‌లో దుండగులను అభ్యర్ధించిన న్యూస్ ప్రెజెంటర్

ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు...నన్ను కాల్చొద్దు అంటూ టీవీ లైవ్‌లో న్యూస్ ప్రెజెంటర్ వేడుకొన్నాడు. భయంతో వణికిపోయాడు. ఈక్ఎడార్‌లో మొహానికి ముసుగు ధరించిన కొందరు దుండగులు అలజడి సృష్టించారు. అక్కడి అధ్యక్షుడు నోబోవా దేశంలో అత్యవసర పరిస్థితి విధించాక ఈ ఘటన జరిగింది.

Ecuador : ప్లీజ్ నన్ను కాల్చొద్దు... లైవ్‌లో దుండగులను అభ్యర్ధించిన న్యూస్ ప్రెజెంటర్
New Update

Ecuador TV Studio : ప్రస్తుతం ఈక్వెడార్‌లో పరిస్థితులు ఏం బాలేవు. అక్కడ కొన్ని రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. సోమవారం నుంచి ఈక్వెడార్‌(Ecuador) లో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు డ్రగ్ డీలర్లు(Drug Dealers) జైలు నుంచి తప్పించుకున్నారు. తప్పటి నుంచి ఆ దేశంలో వరుస దాడులు జరుగుతున్నాయి. కొంత మంది పోలీసులు, ఉన్నతాధికారులను కిడ్సాప్ కూడా చేశారు. 20 డ్రగ్ ముఠాలను ఉగ్రవాద సంస్థులుగా ప్రకటించింది ఈక్వెడార్ ప్రభుత్వం. దేశం మొత్తం సైనిక బలగాలను మొహరించారు. డ్రగ్ ముఠాకు చెందిన వ్యక్తు ఎక్కడ కనిపించినా హతమార్చాలని సైనికులకు ఆదేవాలు జారీ చేవారు. అందుకు సంబంధించిన అధికారం కూడా వారికి ఇచ్చారు.

Also Read:మరీ ఇంత పిచ్చేంటీ..ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఆర్టీసీ బస్సును వాడేసుకుంటారా…

టీవీ ఛానెల్లో దుండగులు..

ఈ నేపథ్యంలో నిన్న ఈక్వెడార్‌లోని టీసీ టీవీలోకి కొంతమంది సాయుధ ముష్కరులు ప్రవేశించారు. ముఖానికి మాస్కులు వేసుకుని చేతుల్లో గన్స్ పెట్టుకుని అక్కడ ఉన్న వారందరినీ బెదిరించారు. లైవ్‌లో న్యూస్ ప్రెజెంటర్‌ మీద తుపాకీ ఎక్కు పెట్టి బెదిరించారు. తమ దగ్గర బాంబులున్నాయని.. పోలీసులు ఎవ్వరూ రారని బెదిరించారు. ఈ మొత్తం వ్యవహారం అంతా టీవీలో లైవ్‌లో ప్రసారం అయింది. తుపాకీలు కాల్చిన శబ్దాలు కూడా వినిపించాయి. మొత్తం స్టాఫ్ అంతటినీ నేలపైన పడుకోబెట్టి... చెప్పినట్టు వినాలని లేకపోతే కాల్చేస్తామని భయపెట్టారు.

ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని... 

దీంతో కొంతసేపు పాటూ టీవీ ఛానెల్లో(TV Channel) అలజడి రేగింది. అక్కడ ఉన్నవారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదని... కొంతసేపు ముష్కరులు హంగామా చేసారు... పోలీసులు టీవీ ఆఫీసును చుట్టుముట్టారు అని తెలిసాక అక్కడి పనుంచి పారిపోయారు. అయితే టీవీ ఛానెల్లో ఎవ్వరికీ ఏమీ కాలేదని తరువాత పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించి 13 మంది అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద చర్యల కింద కేసును నమోదు చేశారు. టీవీ చానెల్ దాడి వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియలేదు.

దేశం విడిచి వెళ్ళిపోవాలనుంది...

టీవీ స్టూడియోలో జరిగిన మొత్తం వ్యవహారం 15 నిమిషాల పాటూ లైవ్‌ లో వచ్చింది. దుండగులు కార్యాలయంలోకి వచ్చినప్పుడు తాను కంట్రోల్‌ రూమ్‌లో ఉన్నానని...తన తల మీద తుపాకీ గురి పెట్టి బెదిరించారని చెబుతున్నారు టీసీ టీవీ ఛానెల్ అధిపతి మాన్రిక్. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని...దేశం విడిచి పారిపోవాలనిపిస్తోందని అన్నారు.

#tv-channel #terrorists #ecuador #live
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe