ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య వార్ రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. ఇరు దేశాలు మొడిపట్టుదల పట్టుకుని కూర్చున్నాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ గాజాలో భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. దీని వలన వేలమంది పాలస్తీనియన్లు చనిపోతున్నారు, గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశానికి కీలక సూచనలు చేశారు. 9/11 తర్వాత అమెరికా చేసిన తప్పుల నుంచి ఇజ్రాయెల్ నేర్చుకోవాలని ఆయన సూచించారు. తాను ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు 9/11 ఘటన వలన అమెరికా అనుభవించిన నరకాన్ని చెప్పానని అన్నారు. అప్పడు న్యాయం కోసమని చెప్పి చాలా తప్పులు చేశామని...ఆవేశంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి అడుగులు వేయొద్దని బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ఏం చేసినా బాగా ఆలోచించి అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read:గజదొంగ టైగర్ నాగేశ్వర్రావు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా?
2001 సెప్టెంబర్ లో అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలో దాడులు చేవారు. మూడు వేల మంది చావుకు కారణమయ్యారు. దీంతో కోపం వచ్చిన అమెరికా ఉగ్రవాదాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తమ సైన్యాన్ని మోహరించింది. 2011లో ఒసామా బిన్ లాడెన్‌నూ చంపింది. చాలామంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. కానీ దాని కారణంగా 20 ఏళ్ళ పాటూ అమెరికా సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉంచాల్సి వచ్చింది. ఇప్పడు ఇజ్రాయెల్ కూడా అలాగే గాజాలో ఇరుక్కుపోవలసి వస్తుందేమో...అలాంటి పని చేయొద్దని బైడెన్ హెచ్చరిక చేశారు.
ఇక నిన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రసంగం చేశారు. హమాస్, రష్యా రెండూ ఒక్కటేనని, ఈ రెండిటినీ ఎన్నటికీ గెలవనివ్వబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాయని, ఆ రెండు దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. హమాస్, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నాయని కానీ ఆ రెండింటి లక్ష్యం ఒకటేనన్నారు బైడెన్. పొరుగున ఉన్న ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలనే కోరుకుంటున్నారని మండిపడ్డారు. హమాస్, రష్యా ముప్పులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తామని, అమెరికా ప్రయోజనాలకు కీలకమని స్పష్టం చేశారు.