Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌కు క్రీడాకారుల మద్దతు వినేశ్ ఫోగాట్‌కు ఇతర క్రీడాకారుల దగ్గర నుంచి విపరీతంగా మద్దతు వస్తోంది. ఆమెకు జరిగిన అన్యాయానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. పతకం తేకపోయినా...కోట్లమంది భారతీయుల మనసులను గెలుచుకున్నావు అంటూ ఆమె కోసం పోస్ట్‌లు పెడుతున్నారు. By Manogna alamuru 08 Aug 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Vinesh Phogat: ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన మొదటి మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించింది. అయితే ఆమెను దురదృష్టం ఎదురవడంతో పతకం కోల్పోవడమే కాక ఒలింపిక్స్ నుంచే అర్హత కోల్పోయింది. అది కూడా కేవలం వంద గ్రాముల బరువు కారణంగా. అయితే వినేశ్ కనబరిచిన ఆటను, ఆమె పోరాట స్ఫూర్తిని మాత్రం ఎవ్వరూ మర్చిపోలేదు. ముఖ్యంగా భారతీయులు. కోట్లమంది భారతీయులు వినేశ్‌కు మద్దతు పలుకుతున్నారు. మెడల్ తేకపోయినా..తమ మనసులను గెలుచుకున్నావు అంటూ స్పందిస్తున్నారు. మరోవైపు వినేశ్ ఫోగట్‌కు మద్దతుగా ఇతర భారత క్రీడాకారులు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆమె సృష్టించిన రికార్డ్‌కు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. నిజమైన ఛాంపియన్ అవడానికి బంగారు పతకమే తేవక్కర్లేదు..ప్రజల దృష్టిలో మీరు అంతకు మించి అన్నారు..ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, మాజీ షూటర్ అభినవ్ బింద్రా. డియర్ వినేశ్ నువ్వు మాకు ఎప్పటికీ ఛాంపియన్ వే. ఈ ఒలింపిక్స్‌లో తప్పకుండా స్వర్ణం సాధిస్తావని అనుకున్నా. నీతో ఉన్న కొద్ది సమయంలోనే నేనెంతో స్ఫూర్తి పొందాను. నా మద్దతు నీకు ఎప్పటికీ ఉంటుంది – స్టార్ షట్లర్ పీవీ సింధు గుండె బద్ధలైంది. ఆమె మళ్ళీ వెనక్కు వస్తుంది - ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇది చాలా దురదృష్టకరం. వినేశ్‌కు అన్యాయం జరిగింది. ఇదేం తొలి రౌండ్ కాదు. వరల్డ్ మెడల్ సాధించే మ్యాచ్. దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద భారత్ తమ నిరసనను బలంగా వినిపించాలి - టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మరో స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా వినేశ్‌కు అండగా నిలిచాడు. ఆమె కోసం ప్రపంచం మొత్తం ప్రార్ధిస్తోందని..అండగా ఉందని చెప్పాడు. ముందు అంతా అన్నీ సవ్యంగా ఉన్నాయి. ఒక్కసారిగా పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలియడం లేదు. దీన్ని తాను నమ్మలేకపోతున్నాని చెప్పాడు. యావత్ భారతదేశం కన్నీటి పర్యంతం అయింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మహిళా రెజ్లర్లంతా వినేశ్‌కు అండగా ఉంటారని ఆశిస్తున్నా అని బజరంగ్ పునియా తన పోస్ట్‌లో రాశాడు. विनेश ने इतिहास रच दिया है. विनेश महिला कुश्ती में ओलंपिक के फाइनल में पहुंचने वाली पहली भारतीय महिला पहलवान बन गई हैं. आज सब भारतीयों की आंखों में आसूं हैं. ये देश की बेटियां हैं, जिन्होंने हमेशा ही देश की शान बढ़ाई है. जिन लोगों ने हमेशा इन बेटियों की राह में कांटे बिछाए… pic.twitter.com/NJ8t4p4h0Y — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) August 6, 2024 Dear @Phogat_Vinesh, you will always be a champion in our eyes. I was deeply hoping you could win the gold. The little time I spent with you at PDCSE was watching a woman with a superhuman will fight to get better. It was inspiring. I am here for you always, sending all the… — Pvsindhu (@Pvsindhu1) August 7, 2024 Completely gutted . Sometimes u dont need a gold medal to be a true champion to people…. — Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) August 7, 2024 बहन @Phogat_Vinesh आप हमारी Golden Girl है आपने जो किया है वो इतिहास में हमेशा याद रखा जाएगा🙌 ज़िंदगी एक संघर्ष है और उस संघर्ष का नाम विनेश है ✊🇮🇳 एक पल आप Olympic के फाइनल में पहुँच कर इतिहास रच देती हैं और अगले ही पल में दुर्भाग्यपूर्ण सब कुछ हाथ से चला जाता है 💔 बहन इस… pic.twitter.com/HR48AWAz0F — geeta phogat (@geeta_phogat) August 7, 2024 Also Read:Bangladesh: ఇండియా సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు #olympics #athletes #vinesh-phogat #players మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి