/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-32-1.jpg)
Plane Crashed: బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని విన్హెడో నివాస ప్రాంతంలో కొద్ది సేపటి క్రితం 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. సావో పాలోలోని గౌరుల్ ఎయిర్ పోర్ట్‌కు ఇది వెళుతోంది. ఇందులో 58 ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ బ్రెజిల్‌లోని ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సివా ఈ విషయాన్ని ప్రకటించారు. విమానంలో ఉన్నవారందరూ మరణించారని ఆయన తెలిపారు. వారికోసం కొద్దిసేపు మౌనం ప్రకటించాలని కూడా దేశాధ్యక్షుడు కోరారు. అయితే మృతుల సంఖ్య మీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
విమానం బ్రెజిల్‌లోని నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రాంతానికి అగ్నిమాపక, మిలటరీ సిబ్బంది చేరుకున్నాయి. నివాస ప్రాంతం కావడం వలన అక్కడ కూడా కొంత మంది గాయపడి లేదా చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతంలో విమానం కూలిపోతూ కనిపించింది. అప్పుడు దాని నుంచి పెద్దగా మంటలు, పొగ వస్తున్నట్టు కూడా కనిపించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. దాంతో పాటూ మృతుల వివరాల కూడా తెలియాల్సి ఉంది.
BREAKING: Voepass Flight 2283, a large passenger plane, crashes in Vinhedo, Brazil pic.twitter.com/wmpJLVYbB3
— BNO News (@BNONews) August 9, 2024
Also Read:Paris Olympics: భారత్‌కు మరో పతకం..అమన్ కు కాంస్యం