Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..!

ఎల్బీనగర్ - హయత్‌నగర్‌ మార్గంలో 6 మెట్రో స్టేషన్లకి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వేగంగా డీపీఆర్‌ పనులు సాగుతున్నాయి. ఈ మార్గం మొత్తం దూరం 7 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు అటూఇటుగా ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..!
New Update

హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ - హయత్‌నగర్‌ మార్గంలో 6 మెట్రో స్టేషన్లకి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వేగంగా డీపీఆర్‌ పనులు సాగుతున్నాయి. ఈ మార్గం మొత్తం దూరం 7 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు అటూఇటుగా ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీనగర్ - చింతల్‌కుంట సెంట్రల్ మీడియన్‌లో మెట్రో స్టేషన్ రానుంది. మిగిలిన 5 స్టేషన్లు ఎక్కడెక్కడ రానున్నాయో త్వరలోనే స్పష్టత రానుంది.

Also Read: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం!.. రేవంత్ బిగ్ ప్లాన్

అయితే చింతల్‌కుంట - హయత్‌నగర్ మార్గంలో ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రో రైలు మార్గం నిర్మించాలని ప్లాన్ వేస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు కారిడర్ - 1 ఉంది. ఈ కారిడర్‌-1ని హయత్‌నగర్ వరకు పొడిగించాలనేదే ప్లాన్.

Also read: గ్రూప్-1 మెయిన్స్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్!

#telugu-news #telangana-news #lb-nagar #hyderabad-metro #metro
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe