Salman Khan : సల్మాన్‌ను హత్య చేసేందుకు పాక్ నుంచి కుట్ర.. ఏకంగా ఏకే-47తోనే....! సల్మాన్‌ను పక్కా ప్లాన్‌తో చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర చేసినట్టు సమాచారం. దీని కోసం పాక్ నుంచి ఏకే-47ను తెప్పించినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా ఫార్మ్ హౌస్ లోకి దూసుకెళ్లి దాడి చేయడం వీరి ప్లాన్‌గా ఉన్నట్లు సమాచారం. By Archana 01 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Salman Khan Murder : ఇటీవలే ఏప్రిల్ 14న బాలీవుడ్ (Bollywood) నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి ముందు కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ముంబై (Mumbai) లోని బాంద్రా ప్రాంతంలో అయన నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ దగ్గర మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన తర్వాత సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. గతంలోనూ పలు మార్లు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ పై బెదిరింపులకు పాల్పడింది. ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు సల్మాన్ ను హత్య చేసేందుకు కుట్ర అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. కొంతకాలంగా సల్మాన్ ను టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్ ... పక్కా ప్లాన్ తో సల్మాన్ హత్యకు కుట్ర చేస్తున్నట్లు సంబంధింత వర్గాలు వెల్లడించాయి. బాంద్రాలో సల్మాన్ ఇంటి ముందు కాల్పులు ఘటనలో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులకు ఈ హత్య కుట్ర గురించి తెలిసినట్లు సమాచారం. పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్ అతన్ని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ తో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీని కోసం ఇతర దేశాల నుంచి ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా ఫార్మ్ హౌస్ లోకి దౌర్జన్యంగా దూసుకెళ్లి దాడి చేసేందుకు బిష్ణోయి గ్యాంగ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 15-20 మందితో రెక్కీ అంతే కాదు సల్మాన్ ను హతమార్చేందుకు..అతడు నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో15- 20 మంది రెక్కీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు.. ఎప్పటికప్పుడు సల్మాన్ కదలికలను బిష్ణోయి గ్యాంగ్ కు చేరవేస్తున్నట్లు తెలిసింది. ఈ రెక్కీ గ్యాంగ్ కోసం ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు. Also Read: Salman khan : కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్ #salman-khan #lawrence-bishnoi #bishnoi-gang మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి