/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-29-7.jpg)
Pendem Dorababu: పిఠాపురంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎలాంటి పదవి ఆశించకుండా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు, పెద్దలకు దూరంగా ఉంటున్నారు పెండెం దొరబాబు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ పెండెం దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్.
ఇది కూడా చదవండి: Rahul Dravid: 2028 ఒలింపిక్స్‌లోకి క్రికెట్ ఎంట్రీ.. పతకం కోసం సిద్ధంగా ఉన్నామన్న ద్రావిడ్!
దీంతో వంగా గీత, దొరబాబు మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఎన్నికల టైంలోనే దొరబాబు జనసేన వైపు చూశారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత దొరబాబును వైసీపీ పట్టించుకోకపోవడంతో ఇటీవల అల్లుడు రామయ్యతో కలిసి పవన్‌తో దొరబాబు సమావేశమయ్యారని తెలుస్తోంది. ఢిల్లీలో జగన్ నిరసనకు దూరంగా ఉంటున్న దొరబాబు.. రెండు, మూడు రోజుల్లో వైసీపీకి గుడ్ బై చెప్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.