ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో ఓ ఆసక్తికర ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 99 మంది ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిల్ దాఖలైంది. ఫతేపూర్ జిల్లాకు చెందిన భారతి దేవి అనే మహిళ ఈ ప్రజాహిత వ్యా్జ్యాన్ని దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. 'ఘర్ ఘర్ గ్యారెంటీ స్కీమ్'ను ప్రకటించిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా తమకు ఓటు వేస్తే.. ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడమే కాక ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు హామీ ఇచ్చారన్నారు.
Also Read: హిండెన్‌బర్గ్ నుంచి సంచలన ట్వీట్.. అదాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు ?
ఈ స్కీమ్‌ను ప్రకటించి ఓటర్లకు డబ్బు ఆశచూపించడం అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాం 1951ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఓటర్లను నమ్మించి 99 మంది ఎంపీలుగా గెలిచారని.. వాళ్లందరినీ అనర్హులుగా ప్రకటించాలని కోర్టును కోరారు. అలాగే 99 మంది ఎంపీలపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని అభ్యర్థించారు.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గ్యారంటీ కార్డులు కూడా పంచారని.. ఎన్నికల సంఘం పారదర్శకతను దెబ్బతీసేలా ఈ పథకాన్ని ప్రకటించారని ఆరోపించారు.
ఇంత జరిగినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిదని మండిపడ్డారు. సెక్షన్ 16A, ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం కాంగ్రెస్‌కు రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్నారు. అయితే ఈ పిల్‌పై అలహాబాద్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటునే దానిపై చర్చ నడుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 292 స్థానాల్లో గెలవగా.. ఇండియా కూటమి 233 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Also Read: త్వరలోనే కేటీఆర్ అరెస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!