Telangana: కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది-రఘునందన రావు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పాత్ర ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత రఘునందనరావు. గొప్ప హిందువు అయినట్టు హరీష్ రావు నేడు హనుమాన్ చాలీసా చదువుతున్నారు కానీ...అదంతా ఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిమళ్ళించేందుకే అంటూ మండిపడ్డారు.

Telangana: కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది-రఘునందన రావు
New Update

Raghunandan Rao On Phone Tapping: కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటున్నారు బీజేపీ నేత రఘునందనరావు. తన ఉప ఎన్నిక జరిగిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ మీద కంప్లైంట్ ఇచ్చాననని...కానీ అప్పుడు పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు. 2014 నుంచి కేసిఆర్ (KCR) హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలి. ఉద్యమ సమయంలో పోలీస్ అధికారులు మా ఫోన్లు విన్నారు. ఆ అధికారుల డీటైల్స్ నా దగ్గర ఉన్నాయి . ఫోన్ ట్యాపింగ్ లో ఏ అధికారిని అడిగినా ప్రభాకర్ రావు (‪Prabhakar Rao) చెప్తే చేశామని అంటున్నారని అన్నారు రఘునందరావు. అయితే ఇన్వెస్టిగేషన్ టీమ్ కనుక్కోవలసిన ఏంటంటే..అసలు ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరూ..ప్రభాకర్ రావు కి చేయమని చెప్పింది ఎవరు? దీని వెనక ఎవరు ఉన్నారు? అనేది కనుక్కోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కూ లోపాయికారీ ఒప్పందం ఉందని...లేకుంటే కేసిఆర్ ను ముద్దాయిగా ఎందుకు చేర్చడం లేదని రఘునందరావు ప్రశించారు. ఫోన్ ట్యాపింగ్ లో A1 కేసిఆర్, A2 హరీష్ , A3 మెదక్ అభ్యర్థి వెంకట్రంరెడ్డి, A4 గా కేటీఆర్ ను చేర్చాలని డిమాండ్ చేశారు.

ఎందుకు కంప్లైంట్ చేయడం లేదు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్‌కు సంబంధం లేకపోతే పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు రఘునందనరావు. ఫోన్ ట్యాపింగ్ పై రాజాగోపాల్ రెడ్డి, వివేక్ లు కంప్లైంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. దీనిపై వివేక్ , రాజగోపాల్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. వెంకట్రంరెడ్డి నీ వారి వియ్యంకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటూ...కాంగ్రెస్ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దని డీజీపీ కి చెప్పానని రఘునందనరావు (Raghunandan Rao) అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ, హోం సెక్రెటరీ సైన్ చేయాలి. అలా కాకుండా నలుగురు ఎమ్మెల్యే ల ఫోన్ ట్యాపింగ్ చేసి మా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ bl సంతోష్ ను ముద్దాయిగా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రస్తుత మెదక్ బీఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రఘునందన రావు. దీని మీద సీఎం మౌనంగా ఉండటం వెనుక మర్మం ఏంటో తెలియాలని అన్నారు. తొందరలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్ట్ కి వెళ్తా.. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు.

పక్కదోవ పట్టించడానికే హనుమాన్ చాలీసా..

హరీష్ రావు (Harish Rao) గొప్ప హిందువు అయినట్టు ...హనుమాన్ చాలీసా చదివాడు..మేమే నికార్సయిన హిందువు అని చెప్పుకునే ప్రయత్నం హరీష్ రావు చేసారు. కానీ అసలు నిజం ఏంటంటే..ఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు హనుమాన్ చాలీసా చదివాడు. నాలుగు లైన్ల హనుమాన్ చాలీసా లో నాలుగు తప్పులు చదివాడు. ఆయన నిజంగానే హిందువు సపోర్టర్ అయి ఉంటే..మీరు అధికారంలో ఉన్నప్పుడు నీవు మాట్లాడిన చోటే పూజారి సత్యనారయణ హత్య జరిగింది..కనీసం ఆయన కుటుంబాన్ని పరామర్శించారా అంటు రఘునందనరావు ప్రశ్నించారు. భైంసా ఘటన సమయంలో ఎందుకు మాట్లాడలేదు? హిందువుల దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే.. ఎందుకు మాట్లాడలేదు ? మొన్న చేంగిచేర్ల ఘటన మీద ఎందుకు మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు కశిం రజ్వీ వారసులు...అధికారం పోయాక హిందువులా? అంటూ మండిపడ్డారు.

హరీష్ రావు హిందువు అంటే .. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శలు చేశారు. బీ అర్ ఎస్ ప్రతి నిమిషం హిందువులకు వ్యతిరేకంగా పని చేసింది దుయ్యబట్ఆరు రఘునందనరావు.

Also Read:  అసలేంటీ కచ్చతీవు…దాని గురించి గొడవ ఎందుకు అవుతోంది?

#bjp #phone-tapping #raghunandan-rao #harish-rao #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe