Free Bus : మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా? హైకోర్టులో దాఖలైన పిల్

తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కల్పించారు. దానికి విపరీతమైన ఆదరణ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ ప్రయాణం ఆగిపోనుందా అనే డౌట్ వస్తోంది ఎందుకంటే దీని మీద ఒక ప్రవైట్ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Free Bus : మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా? హైకోర్టులో దాఖలైన పిల్
New Update

Petition Filed Against Free Bus : తెలంగాణ(Telangana) లో మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం మొదలై నెల రోజులు అవుతోంది. దీనివల్ల ప్రయాణికులు సంఖ్య కూడా భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇది కొనసాగుతుందా లేదా అనేది డౌట్‌లో పడింది. దీని మీద ఒక ప్రవైట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకు వస్తుందని నాగోల్‌కు చెందిన ఉద్యోగి తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) పిల్ వేశారు.

Also read:ఎన్టీయార్ ఫ్యామిలీలో మళ్ళీ బయటపడ్డ విభేదాలు

ఆర్టీసీ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది...

ఆర్టీసీలో వ్యవహారాల మీద నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఆర్టీసీలో(TSRTC) మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఇవ్వడం వలన మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని... దీని వలన మిగతా వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని పిటిషనర్ అంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ 8న జారీ చేసిన జీవో 47ను సస్పెండ్‌ చేయాలని కోరారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై(Free Bus Scheme) అధికారం రాష్ట్రానికి లేదని ఆయన అంటున్నారు. అంతేకాదు ఉచిత ప్రయాణం వలన ఆర్ధికంగా ఆర్టీసీ మీద పడే ఆర్ధిక భారాన్ని కూడా ప్రభుత్వం భరించడం అన్యాయమేనని పిటిషన్ వాదిస్తున్నారు. పన్నుల రూపంలో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇలా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించడం ఎంతవరకు సమంజసమని పిటిషనర్ అడుగుతున్నారు.

వెంటనే ఆపేయాలి...

పైన చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళ ఉచిత ప్రయాణాన్ని వెంటనే నిలిపవేయడానికి ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌, ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఈ పిల్‌లో ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ జరుపనుంది.

#telangana #free-bus-scheme #high-court #women #petition
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి