బాబు మోసగాడైతే..పవన్‌ గజ మోసగాడు: పేర్ని నాని!

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు

బాబు మోసగాడైతే..పవన్‌ గజ మోసగాడు: పేర్ని నాని!
New Update

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు. రాష్ట్రంలో 2014 లో పార్టీ పెట్టిన పవన్‌ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అని ప్రశ్నించారు.

సినిమా డైలాగులు, సీరియల్‌ డైలాగులు చెబితే ప్రజలు నమ్మరు అంటూ హితవు పలికారు. అసలు నియోజకవర్గమే లేని పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు? ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో చెప్పాలంటూ ఆయన నిలదీశారు.

ఎవరో టీ షాప్‌ వ్యక్తి ఇచ్చిన డబ్బులతో ఓ పాత వ్యాన్‌ కొని దానిని కొంచెం మార్పులు చేసి..వారాహి అని పేరు పెట్టి..పైకి ఎక్కి ఊగిపోతూ మాట్లాడటం తప్ప అతను రాష్ట్రానికి చేస్తున్న మంచి ఏంటో చెప్పాలని నిలదీశారు. ఈ రాష్ట్రంలో పర్మిషన్‌ రాదు అనుకున్నారో ఏమో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ని కాకపట్టి పర్మిషన్‌ తెచ్చుకున్నాడు.

పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో చెప్పాలన్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తున్నాడా? లేడా? చెప్పాలన్నారు. కలిసి పోటీ చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉందా? పేర్ని నాని అని నిలదీశారు.

ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు మీద కూడా నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్లను చూసుకొని రెచ్చిపోయారే తప్ప ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా బాగు చేసింది ఉందా? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు చిన్నవాడైన జగన్‌ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే చంద్రబాబు కి పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు.

2047 విజన్‌ అంటూ ప్రజలను మాయ చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తారా? ఆనాడు వైఎస్సాఆర్‌ ఉచిత విద్యుత్ అంటే హేళన చేసిన పెద్ద మనిషి ఈరోజు విద్యుత్‌ గురించి ఎలా మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు.

ఆరోగ్యం పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్‌ ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ చంద్రబాబుది కాదు, ఇది వైయస్‌ఆర్‌ విజన్‌ గా గుర్తు చేసారు. విజన్ 2020 అడ్రస్ లేకుండా పోయిందని, ఇవాళ 2047 మొదలుపెట్టారని ఎద్దేవా చేసారు పేర్ని నాని.

#pawan-kalyan #chandrababu-naidu #ycp #tdp #janasena #perni-nani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe