మద్యం నిషేధం అమలవుతున్న బిహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ కారుకు ప్రమాదం జరిగింది. అయితే అందులో ఉన్న మద్యం సీసాలను అక్కడున్న స్థానికులు ఎత్తుకెళ్లారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఓ కారులో విదేశీ మద్యాన్ని కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. అలా ఆ కారు వేగంగా వెళ్తుండగా.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత దారిన వెళ్లేవారు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ అప్పటికే అందులో ఉన్నవారు ఆ కారును వదిలేసి పారిపోయారు. తీరా కారు లోపాల చూస్తే మద్యం బాటీళ్లు కనిపించాయి. దీంతో అక్కడున్న వాళ్లు వాటిని తీసుకుని పరుగులు పెట్టారు.
Also Read: హ్యాకింగ్ వ్యవహారంలో మరో ట్విస్టు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అదిచూసి మరికొందరు కారు వద్దకు రావడంతో రహదారిపై గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలాఉండగా.. 2016 నుంచి బిహార్‌లో మద్యం నిషేధం కొనసాగుతోంది. మద్యం బాటిళ్లను అక్రమంగా తరిలించిన వారితోపాటు.. వాటిని తీసుకెళ్లినవారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే వీడియోలో ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో స్థానికులు తమ విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయ్యండి.