Good News For Pentioners: ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు మొట్టమొదటగా ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. దీంతో పాటూ తమ ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను సైతం తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రాలో ఇచ్చే పెన్షన్లకు సంబంధించి ప్రకటన కూడా చేశారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ జులై నుంచి తిరిగి ఇస్తామని...అది కూడా ఏప్రిల్ నుంచి కలిపి 7 వేలు ఇచ్చేస్తామని తెలిపారు మంత్రి నిమ్మల. పెన్షన్లను ఇంటింటికి అందిస్తామని
చెప్పారు.
వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు..
జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ మీద మంత్రి నిమ్మల స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమ తాత్కాలికంగా వారిని విధుల నుంచి దూరం పెట్టామని చెప్పారు. ప్రభుత్వం త్వరలోనే దీనిపై సమీక్ష చేస్తుందని...ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారిని ప్రజా సేవ కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని హామీలు నెరవేరుతాయని తెలిపారు. శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నిమ్మల.
Also Read:AP Mega DSC: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!