రేపు ( డిసెంబర్ 25) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించారు. వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. అనా కొణిదెలను హోమ్ నిర్వాహకులు సత్కరించారు.
అటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ క్షమాగుణాలను తన జీవితం సందేశంగా మానవాళికి అందించిన ఏస్తు క్రిస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్ అంటూ పవన్ కళ్యాణ్ వివరించారు.
ఈ పవిత్ర పండుగ తరుణంలో క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, సామాజిక విలువలు చైతన్యం కావాలంటే క్రీస్తు భోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఎల్లప్పుడూ ఆచరణీయమన్నారు. ప్రతి మనిషి ఎంతో కొంత పరోపకార గుణం అలవర్చుకోకపోతే జీవితానికి అర్థం ఉండదన్నారు. ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి, సౌభార్యాలతో విలసిల్లాలని కోరుతూ నా పక్షానా, జనసేన శ్రేణుల తరపున మనసారా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: చలికాలంలో ఇలా స్నానం చేస్తే జ్వరం, జలుబు రాదు!