Pawan Kalyan Vishaka Tour: విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ !

విశాఖలో ఐదు రోజుల వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు భీమిలి నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మంగళగిరి నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్. విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

New Update
Pawan Kalyan Vishaka Tour: విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan Vishaka Tour: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) విశాఖలో కొనసాగుతుంది. ఇప్పటికే వారాహి యాత్ర రుషికొండ, విసన్నపేటలోని కొన్ని భూములను పరిశీలించి తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. ఆ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలతో పాటు , పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కు ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ప్రకటించారు.

ఇప్పటికే విశాఖలో ఐదు రోజులు వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన మంగళగిరి (Mangalagiri) నుంచి బయల్దేరి విశాఖ చేరుకున్నారు.

విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

6 వ రోజు వారాహి విజయ యాత్రలో భాగంగా భీమిలి నియోజక వర్గంలో పర్యటిస్తారు.

జియో హెరిటేజ్‌ సైట్ గా గుర్తింపు పొందిన ఎర్రమట్టి గుట్టులను ఆయన పరిశీలిస్తారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను జగన్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్ వ్యాపారుల కోసం ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తుంది జనసేన.

ఏపీలోని ఉత్తరాంధ్ర లో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన నియామాలు, వ్యూహాల గురించి పార్టీ నేతలతో చర్చించడంతో పాటు మరో వైపు వారాహి విజయ యాత్రలో అధికార పార్టీ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ వస్తున్నారు.

ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. శనివారం వరకు కూడా పవన్‌ వారాహి యాత్ర విశాఖ పట్టణం జిల్లాలో కొనసాగనుంది. జనసేన (Janasena) పార్టీ అధికారంలోకి వస్తే అక్రమాస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చే వారికి గిఫ్ట్ ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ పాలనలో అవినీతి, అక్రమాలకు తావిచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు.

Also Read: రోహిత్ శర్మ మంచివాడు కానీ, భారత జట్టుకు.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు