Ustaad Bhagat Singh: 'గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం'.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా 'భగత్స్ బ్లేజ్' అంటూ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో గ్లాస్ అనే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అని పవన్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది.

New Update
Ustaad Bhagat Singh: 'గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం'.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్

Ustaad Bhagat Singh: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో.. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Kumari Aunty: ఆ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను .. వైరలవుతున్న కుమారి ఆంటీ ఇంటర్వ్యూ ..!

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్

ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. 'భగత్స్ బ్లేజ్' అంటూ షేర్ చేసిన ఈ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా "గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది .. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం" అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్.. గ్లిమ్ప్స్ రిలీజ్ చేయడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: Magadheera: చెర్రీ ఫ్యాన్స్ కు పూనకాలే .. మగధీర రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Advertisment
తాజా కథనాలు