Pawan Kalyan : 'అమిత్‌షా ఒప్పుకుంటారో లేదో తెలియదు..' పొత్తులపై పవన్‌ కామెంట్స్!

పొత్తులపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సహకరించాలని, కలిసి రావాలని అమిత్‌షాను కోరినట్టు పవన్‌ చెప్పుకొచ్చారు. ఆయన ఎంతవరకు ఒప్పుకుంటారో తనకు తెలియదన్నారు పవన్‌.

New Update
Pawan Kalyan : 'అమిత్‌షా ఒప్పుకుంటారో లేదో తెలియదు..' పొత్తులపై పవన్‌ కామెంట్స్!

AP Elections 2024 : ఏపీలో ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పొత్తులపై ఎక్కడ చూసినా హాట్‌హాట్‌ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఇటు జనసేన(Janasena)-బీజేపీ(BJP) నాలుగున్నరేళ్లుగా కలిసే ఉన్నాయి. అయితే టీడీపీతోనూ కలిసి నడవాలని జనసేన అధినేత నిర్ణయించుకోవడం.. దానిపై ఇప్పటివరకు బీజేపీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై పవన్‌ కల్యాణ్‌ క్యాడర్‌లో కన్ఫ్యూజన్‌ నెలకొంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు వెళ్లిన పవన్‌.. ఆ వెంటనే రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి జగన్‌ను ఓడిస్తామని ప్రకటించారు. ఇక ఆ తర్వాత నుంచి టీడీపీతో టచ్‌లో ఉన్నారు. ఆ పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే విజయనగరంలో టీడీపీ నవశకం బహిరంగ సభ నిర్వహించగా.. ఈ మీటింగ్‌కు వచ్చిన పవన్‌ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒప్పుకుంటారో లేదో తెలియదు:
పొత్తులపై జనసేన అధినేత పవన్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. పొత్తుకు సహకరించాలని, కలిసి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరినట్టు పవన్‌ చెప్పుకొచ్చారు. ఆయన ఎంతవరకు ఒప్పుకుంటారో తనకు తెలియదన్న పవన్‌.. రాష్ట్రంలో పరిస్థితులు ప్రజలకు అనుకూలంగా లేవని దానికి చేయి కలపాలని కేంద్ర పెద్దలకు చెప్పానన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి కొండను.. సహజ వనరులను దోచుకుంటుందని ఆరోపించారు పవన్.

నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేరువేరుగా పోటి చేశాయి. 2019లో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 2014లో 102 స్థానాలు గెలిచిన టీడీపీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జనసేనకు ఒక సీటు రాగా.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అసలు ఖాతా తెరవలేదు. నాటి ఎన్నికల్లో ఓటు చీలిపోయాయని పవన్‌ భావిస్తున్నారు. అందుకే ఈ సారి టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి 2014లో లాగా అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు.

Also Read: ఐపీఎల్‌ ఆక్షన్‌ తర్వాత ఏ ఏ జట్లు ఎలా ఉన్నాయంటే?

WATCH:

Advertisment
తాజా కథనాలు