TDP-Janasena : చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ..సీట్ల సర్దుబాటుపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత బాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇరువురు నేతలూ చర్చించినట్టు సమాచారం. ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరిగాయని తెలుస్తోంది.

New Update
TDP-Janasena : చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ..సీట్ల సర్దుబాటుపై చర్చ

Babu-Pawan Meet : టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈరోజు కలిశారు. ఉండవల్లిలో చంద్రబాబు(Chandrababu) నివాసానికి పవన్ కల్యాణ్ మొదటిసారిగా వచ్చారు. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇరువురు నేతలూ ఎన్నికల ప్రణాళిల మీద చర్చించారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వెంట పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్(Nadendla Manohar) కూడా ఉన్నారు. వీరిద్దరినీ చంద్రబాబు భోజనానికి ఆహ్వానించారు. ఎన్నికలు నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి వచ్చే వలస నేతలపై ప్రధానంగా చర్చ చేస్తున్నట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం నేతలిరువురూ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. తొలి జాబితా సిద్ధం చేసిన తర్వాత ఉమ్మడి జాబితాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.రాజకీయ భవిష్యత్ కోసం వచ్చే నేతల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గట్టిగా డిసైడ్ అయ్యారు.

Also Read:ఒక మెదడు…ఎనిమిది చేతుల వింత జీవి గురించి మీకు తెలుసా..

ఇక భవిష్యత్ కార్యాచరణతో పాటు టీడీపీ-జనసేన(TDP-Janasena) తొలి జాబితా విడుదలపైన కూడా ఇరువురు నేతలూ చర్చించారు. ఏపీ(AP) లో సీట్ల కేటాయింపు మీద కూడా చర్చ జరిగింది. ఇక రేపు మందడంలో నిర్వహించే భోగీ మంటలు కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలను కాల్చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హాజరవనున్నారు. ఈ భోగి వేడుకల్లో పవన్, చంద్రబాబు ఉదయం 7 గంటలకు పాల్గొననున్నారు.

హరిరామ జోగయ్య లేఖ..

మరోవైపు మాజీ మంత్రి హరిరామ జోగ్య విడుదల చేసిన బహిరంగ లేఖ ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుత భేటీకి కొద్ది గంటల ముందే ఈ లేఖ రావడంతో..అందులో విషయాలు ఏమైనా చర్చకు వస్తాయా లేదా అనేది ఉత్కంఠగా మారింది. తాజాగా కాపు నాయకుడు, మాజీ మంత్రి చేంగొడి హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. పవన్‌ ఆహ్వానం మేరకు మంగళగిరిలోని ఆయన పార్టీ ఆఫీసుకు వెళ్లి 2 గంటలకు ముఖ్య అంశాలపై చర్చించామని లేఖలో పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన 40 నుంచి 60 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిన ఆవశ్యకతను చెప్పానని తెలిపారు. జనసేనికులు పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. అధికార పంపిణి సవ్యంగా జరిగితేనే రెండున్నరేళ్ల పాటు పవన్ సీఎంగా పనిచేసే అవకాశం ఉంటుందని వారు నమ్మినప్పుడే జనసేన ఓట్లు టీడీపీకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Also Read : Mid Cap Funds: ఈ ఫండ్స్ గతేడాది మంచి లాభాలు ఇచ్చాయి.. ఇన్వెస్ట్ చేయొచ్చా?

Advertisment
తాజా కథనాలు