జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుషికొండ వద్ద పవన్ ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటరీ వ్యవస్థను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చడాన్ని ఖండించిన ఆయన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కంటే దండుపాళ్యం బ్యాచ్ ఇంకేముంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడుపోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుస్తకాలు అంటే తనకిష్టమని తాను ఎక్కువ సమయం పుస్తకాలు చదివేందుకే కేటాయిస్తానన్న పవన్.. వాటిలో జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేదని మంత్రి ఎద్దేవా చేశారు.
పూర్తిగా చదవండి..పవన్ కళ్యాణ్ వీధి రౌడీలా మారిపోయాడు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనడం ఏంటన్నారు. విశాఖలో పవన్ హింస సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Translate this News: