Nidadavole MP Ticket to Kandula Durgesh : ఏపీలో పొత్తు రాజకీయాలు రోజురోజుకి బలపడుతున్నాయి. అలాగే టీడీపీ-జనసేన (TDP- Janasena) మధ్య టికెట్ల వార్ కు కూడా నెమ్మదిగా తెరపడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది.
కందులు దుర్గేష్ (Kandula Durgesh) ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పొత్తులో భాగంగా దుర్గేష్ రాజమండ్రి (Rajahmundry) రూరల్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. అయితే అక్కడ నుంచి బుచ్చయ్య చౌదరి ఉండడంతో పాటు బీజేపీతో పొత్తు కుదరడంతో నిడదవోలు నియోజకవర్గం నుంచి దుర్గేష్ పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.
చాలా కాలం నుంచి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వినిపిస్తుంది. జనసేన (Janasena) 24 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తున్న క్రమంలో తొలివిడతగా ఐదుగురు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. కందుల దుర్గేష్ తో ఇప్పుడు మరో అభ్యర్థిని ప్రకటించారు జనసేన అధినేత.
ఇటీవల పొత్తులో జనసేన – టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 99 ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించగా.. అందులో టీడీపీ 94 మంది, జనసేన 5 మందిని ప్రకటించింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు (Chandrababu).. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో పవన్ కు షాక్ ఇచ్చారు.
3 ఎంపీ స్థానాలను రెండు స్థానాలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకూండా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: ఆస్కార్ వేదిక మీదకు బట్టలు లేకుండా వచ్చిన స్టార్ రెజ్లర్!